Home » Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…

Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…

by Bunty
Ad

పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

READ ALSO : ‘హిమాన్షు’ మరో అరుదైన ఘనత… మనవడికి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం…

Advertisement

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఇతిహాస చిత్రం ఆది పురుష్ అరుదైన గౌరవం దక్కించుకుంది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ దర్శకుడు ఓంరౌత్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?

Adipurush: If You Want To See This Prabhas Starrer Before The World, It's  Going Live At Tribeca Festival ln New York on June 13, 2023

 

“ఇది గౌరవం, సంతోషానికి మించింది. 2023 జూన్ 13న ఆది పురుష్ న్యూయార్క్ లో జరిగే ఫెస్టివల్ లో ప్రదర్శితం అవుతుంది. ఈ సినిమాని ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ణి ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని ఓంరౌత్ తెలిపారు. ఆ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు జరగనుంది.

READ ALSO : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్‌…దుమ్ములేపిన అఖిల్‌

Visitors Are Also Reading