Home » నయనతార- విఘ్నేష్ శివన్ ల ప్రేమ కథలో ఇంత ట్విస్ట్ ఉందా ?

నయనతార- విఘ్నేష్ శివన్ ల ప్రేమ కథలో ఇంత ట్విస్ట్ ఉందా ?

by Anji
Ad

నయనతార-విఘ్నేష్ శివన్ జంట నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి, పిల్లలు వార్తలతో ఈ మధ్య ఈ జంట పేరు సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం. ఇటీవలే ఈ కపుల్స్ ఇద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులైన విషయము అందరికీ తెలిసిందే. అయితే సరోగసి పద్ధతిలో పిల్లలను కనడం అనేది వారికి కొంత ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ వివాదంపై విచారణ చేయడం కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే వారు చాలా రోజుల క్రితమే పెళ్లయినట్టు సర్టిఫికెట్ అందజేయడం విశేషం.

Advertisement

ఈ వివాదము కాస్త ముగిసినట్టే అనిపించింది. అయితే వీరి ప్రేమ కథ గురించి చాలా మందికి అసలు విషయం తెలియదు. ప్రభుదేవా, శింబు నుంచి విడిపోయిన తర్వాత నయనతార విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. వీరు దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారట. వీరి ప్రేమకు తొలి అడుగు పడింది 2017లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ సమయంలోనే పుట్టిందట. ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ ఎంపిక కాలేదట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అనుకోకుండా ఒక హోటల్లో నయనతారను కలవడంతో ఈ సినిమాకు హీరోయిన్ గా నయనతార ఎంపిక చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు ప్లాన్ చేశారట.

Advertisement

Also Read :  ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అంటూ మంచు విష్ణు కామెంట్స్..నెట్టింట ట్రోల్స్..!

నానుమ్ రౌడీ దాస్ సినిమా విడుదలై తరాలు పూర్తవుతున్న సందర్భంగా విఘ్నేష్ సెట్లో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో విగ్నేష్, నయనతార వద్ద ఏదో మాట్లాడుకుంటున్నట్టు కనిపించడం విశేషం. మొత్తానికి ఆ సినిమా ఈ జంటని కలపడం, పిల్లలను జన్మనిచ్చేలా చేసిందనే చెప్పాలి. మరోవైపు త్వరలోనే నయన్ విఘ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీపీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో తీసుకురాబోతోంది. అందుకోసం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించిందట. వీరి పెళ్లి డాక్యుమెంటరీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Also Read :  ఉద‌య్ కిరణ్ 5 సినిమాల‌కు సైన్ చేసిన పింకీ…ఆ సినిమాలు ఎందుకు ఆగిపోయాయంటే..?

Visitors Are Also Reading