Home » ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అంటూ మంచు విష్ణు కామెంట్స్..నెట్టింట ట్రోల్స్..!

ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో అంటూ మంచు విష్ణు కామెంట్స్..నెట్టింట ట్రోల్స్..!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్ర‌భాస్ ఈ పుట్టిన‌రోజుతో 43ఏళ్ల‌లో అడుగుపెట్టారు. ఇక ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో అభిమానుల‌ను సెల‌బ్రెటీలు ఆయ‌న‌కు పెద్దఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కేవ‌లం టాలీవుడ్ స్టార్స్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు చెందిన స్టార్స్ కూడా ప్ర‌భాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Advertisement

ఈ క్ర‌మంలోనే హీరో మంచువిష్ణు కూడా ప్ర‌భాస్ కు సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ లో మంచు విష్ణు త‌న పోస్ట్ లో…మ‌రోత‌ల్లికి పుట్టిన నా సోద‌రుడికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. వ‌చ్చే పుట్టిన‌రోజుకు అత‌డు పెళ్లి చేసుకుంటాడో లేదో కానీ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఇస్తాడు. నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ ప్ర‌భాస్ అంటూ మంచు విష్ణు త‌న పోస్ట్ లో రాసుకువ‌చ్చాడు.

Advertisement

ఇక మంచు విష్ణు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో ప్ర‌భాస్ అభిమానులు కొంత‌మంది థాంక్స్ చెబుతుంటే మ‌రికొంద‌రు మాత్రం విష్ణు పై ఫైర్ అవుతున్నారు. తిన్న‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌కుండా ఎక్స్ట్రాలు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిల ఉంటే మంచు విష్ణు తాజాగా జిన్నా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకు దారుణ‌మైన క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయంటూ ట్రోల్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Wishing my brother from another mother, a wonderful birthday. I don’t know if he will get hooked by the next birthday but I am sure he will give a huge kick ass blockbuster. Much love to you my darling brother <a href=”https://twitter.com/hashtag/prabhas?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#prabhas</a> 🥰</p>&mdash; Vishnu Manchu (@iVishnuManchu) <a href=”https://twitter.com/iVishnuManchu/status/1584133335919435778?ref_src=twsrc%5Etfw”>October 23, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Visitors Are Also Reading