Home » పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యం ఇదే..!

పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యం ఇదే..!

by Anji
Ad

హాలీవుడ్ లో “ఇన్సెప్షన్” అనే సినెమా క్రిష్టోఫర్ నోలన్ తీస్తే మొదటి సారి అర్ధం కాక రెండో సారి చూశా. నా జీవితం లో అలా అర్ధం కాక రెండో సారి చూసిన సినెమా మణిరత్నం గారు తీసిన “పొన్నియన్ సెల్వన్”. ఇంకో వందేళ్ళ తర్వాత అయినా ఇలాంటి సినెమా భారతీయ చలన చిత్ర తెర పై వస్తుంది అని నేను అనుకోను.

Advertisement

సినెమా పరం గా చూస్తే చోళ చక్రవర్తి సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్ద వాడు ఆదిత్య కరికాళన్ (విక్రం), ఆ తర్వాత కుందవి(త్రిష), చిన్నవాడు అరుమోళి(జయం రవి). అంతే గందరగోళం ఏమీ లేదు, చెప్పుకునే పాత్రలు కూడా ఏమీ లేవు (చిన్నవాడు అరుమోళి నే పొన్నియన్ సెల్వన్, ప్రపంచ ప్రఖ్యాత రాజ రాజ చోళుడూ మరియూ తంజావూర్ లో  బ్రుహదీశ్వరాలయాన్ని కట్టించినవాడు మరియూ భారత దేశ చరిత్ర లోనే అత్యంత గొప్ప వ్యక్తి, ఆ వివరాలు తర్వాత)

సుందరచోళుడు (ప్రకాష్ రాజ్) చక్రవర్తి కాకముందు మందాకిని (సినెమా లో ముసలి ఐశ్వర్యా రాయ్) ని ప్రేమిస్తాడు కానీ కొన్ని కారణాల వలన పెండ్లి చేసుకోడు (ఆమె మూగ, చెవిటి కానీ అందగత్తె). మందాకిని వీర పాండ్యన్ ని పెండ్లి చేసుకుంటుంది. వారికి ఇద్దరు పిల్లలు; మదురాంతకుడు మరియూ నందిని (సినెమా లో కనపడే ఐశ్వర్యా రాయ్)

Also Read : సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?

సుందర చోళుడి కొడుకు అయిన ఆదిత్య కరికాళన్(విక్రం) ని నందిని (ఐశ్వర్యా రాయ్) ప్రేమిస్తుంది కానీ విడిపోతారు. ఆ పగ తో చోళ చక్రవర్తి సుందర చోళుడి ఆర్ధిక మంత్రి (శరత్ కుమార్) తన కంటే చాలా పెద్దవాడైనా పెండ్లి చేసుకుంటుంది నందిని. నందిని (ఐశ్వర్యా రాయ్) కి చోళ సింహా సనం మీద కన్ను ఉంటుంది, ఆమె భర్త ఆర్ధిక మంత్రి (శరత్ కుమార్) ద్వారా పావులు కదుపుతూ ఉంటుంది. సుందర చోళుడ్ని దించి ఆమె సింహాసనం ఎక్కాలని ఆమె పథకం.

Also Read : చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాద‌ర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవ‌రో తెలుసా ?

అయితే సుందర చోళుని పిల్లల్లో పెద్ద వాడు ఆదిత్య కరికాళన్ మహాయోధుడు కానీ కోపిష్టి. ఆ తర్వాత అమ్మాయి కుందవి మాత్రం రాజతంత్రం తెలిసిన అత్యంత తెలివైన యువరాణి. తన తమ్ముడు అరుమోళి (పొన్నియన్ సెల్వన్ లేదా రాజ రాజ చోళుడు) ని 19 వ యేట శ్రీ లంక పంపిస్తుంది. ఒకవేళ చోళ సామ్రాజ్యం లో జరగరానిది జరిగితే మళ్ళీ తమ్ముడ్ని పిలిపించి చోళ సామ్రాజ్యానికి చక్రవర్తి ని చేయొచ్చు అనేది ఆమె పథకం. ఫ్రాచీన ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది కుందవి.

Advertisement

Also Read :  అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో స‌గం బ్లాక్‌బ‌స్ట‌ర్లే అనే విష‌యం మీకు తెలుసా ?

తన తండ్రి సుందర చోళుడి రాజ్యాన్ని కాపాడుకోవాలని కుందవి(త్రిష), తన తండ్రి వీర పాండ్యన్ ని చంపిన చోళ రాజ్య సింహాసనం తాను ఎక్కాలని నందిని (ఐశ్వర్యారాయ్). ఇద్దరిలో ఎవరిది పైచేయో తెలియాలి అంటే పొన్నియన్ సెల్వన్ -2 చూడాల్సిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నందిని భర్త (శరత్ కుమార్) కి నందిని పథకం/ కుట్ర తెలియక సుందర చోళుడి అన్న కొడుకు మదురాంతకుడ్ని చోళ సామ్రాజ్యానికి రాజు ని చేయాలి అని కుట్ర పన్నుతాడు. ఆ మదురాంతకుడు నిజానికి చోళ చక్రవర్తి సుందర చోళుడి అన్న కొడుకు కాదు, నందిని (ఐశ్వర్యారాయ్) కి అన్న – మందాకిని కుమారుడు. పుట్టినప్పుడు తన ప్రేయసి పిలగాడ్ని సుందర చోళుడు తెచ్చుకుంటాడు. ఆర్ధిక మంత్రి ఏమో మదురాంతకుడు (నిజానికి నందిని అన్న) ని రాజు చేయాలి అని, ఆర్ధిక మంత్రి భార్య నందిని ఏమో తాను ఆ సింహా సనం ఎక్కాలి అని. వీళ్ళద్దరికీ తెలియదు ఇద్దరూ అన్నా చెల్లెల్లు అని. వీళ్ళద్దరి తల్లి ముసలి ఐశ్వర్యా రాయ్ ఏమో సుందర చోళుడి చిన్న కుమారుడ్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆమె పిల్లలు మాత్రం అరుమోళి ని పొన్నియన్ సెల్వన్ ని రాజ రాజ చోళుడ్ని తుద ముట్టించాలి అని పథకం.

Also Read :  న‌ర‌సింహ‌నాయుడు సినిమాతో దేశంలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు సృష్టించిన బాల‌కృష్ణ‌..!

వల్లవ రాయన్ (కార్తి) ఏమో సుందర చోళుడు ఇద్దరు పిల్లలకి స్నేహితుడు, మరియూ సుందర చోళుని కుమార్తె కుందవి ప్రియుడు. భారత దేశ చరిత్ర లో అత్యంత గొప్ప వాడు రాజ రాజ చోళుడు (పొన్నియన్ సెల్వన్). మన దేశం లో ఏ రాజూ మన ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి దండయాత్ర చేసే దైర్యం, తెగువ చూపలేదు కారణం ఎప్పుడూ అంతర్యుద్ధం లేదా అంతర్గత గొడవలే సరిపోయేవి. ఒకే ఒక రాజు, చక్రవర్తి మాత్రమే మన దేశం కాకుండా వేరే రాజ్యాలని గెలిచాడు. అతను కట్టించిన బ్రుహదీశ్వరాలయాన్ని ప్రస్తుత ప్రపంచం లో ఉన్న పెద్ద పెద్ద ఇంజనీర్లు అంతా కలిసి లక్ష సంవత్సరాలు తల క్రిందకి, కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా కట్టలేరు కారణం రాయి మీద రాయి పెట్టి రెండు రాళ్ళకి మధ్య అతుక్కునే జిగురు లేదా సిమెంట్ వాడకుండా అంత ఎత్తైన కట్టడాన్ని ప్రస్తుత ప్రపంచం లో ఉన్న వారందరూ కలిసినా కట్టలేరు, అది రాజ రాజ చోళుడు కే సాధ్యం.ప్రతి భారతీయుడూ చూడదగిన, చూడాల్సిన సినెమా “పొన్నియన్ సెల్వన్-1”

* సశేషం *

– జగన్
(వ్యక్తిగత అభిప్రాయం)

 

Visitors Are Also Reading