Home » చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాద‌ర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవ‌రో తెలుసా ?

చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాద‌ర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవ‌రో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు నటించిన సినిమా పేర్లను కొంత కాలం త‌రువాత మ‌రో హీరోలు త‌మ సినిమాల‌కు ఉప‌యోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఒకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ కూడా ఇది వరకే ఇతర హీరోలు నటించిన సినిమా టైటిల్స్ ను తన సినిమాలకు పెట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ కూడా ఇదివరకే ఓ సీనియర్ హీరో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చార‌నే విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

Advertisement

గాడ్ ఫాదర్ సినిమా ద్వారా చిరంజీవి కంటే ముందుగానే ప్రేక్షకుల వ‌ద్ద‌ సందడి చేసిన హీరో ఎవరు? ఆ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంది అనే విషయానికి వస్తే.. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇక అదే టైటిల్ తోనే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

Also Read :  ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ రాఘ‌వ జ‌బ‌ర్ద‌స్త్ వ‌ద‌ల‌క పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..?

గాడ్‌ఫాద‌ర్ చిత్రాన్ని మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్‌న‌టించిన లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. మ‌ల‌యాళంలో ఎంతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న లూసిఫ‌ర్ సినిమా తెలుగులో కూడా గాడ్‌ఫాద‌ర్ పేరిట విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో టాప్ 15 చిత్రాల్లో ఇది ఒక‌టిగా నిలిచింద‌ని తాజాగా చిరంజీవి స‌క్సెస్‌మీట్‌లో చెప్ప‌డం విశేషం.

Also Read :  “గాడ్ ఫాద‌ర్” ను చిరు రాజ‌కీయాల కోసం వాడుకున్నాడా..? ఆ సీన్ల‌న్నీ అందుకోస‌మేనా..?

Visitors Are Also Reading