Home » అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో స‌గం బ్లాక్‌బ‌స్ట‌ర్లే అనే విష‌యం మీకు తెలుసా ?

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో స‌గం బ్లాక్‌బ‌స్ట‌ర్లే అనే విష‌యం మీకు తెలుసా ?

by Anji
Ad

అల్లు అర్జున్ త‌న 20 సినీ కెరీర్‌లో స్టైల్‌ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా వ‌చ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌తో పాటు ఐకాన్ స్టార్ అనే బిరుదు కూడా రావ‌డం విశేషం. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్నాడు అల్లు అర్జున్‌. ఇంత పెద్ద స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ త‌న కెరీర్‌లో 12 సినిమాల‌ను వ‌దులుకున్నాడు. ఆయ‌న వ‌దులుకున్న 12 సినిమాల్లో 6 సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం విశేషం. అస‌లు అల్లు అర్జున్ వ‌దులుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


జ‌యం

Advertisement

అల్లు అర్జున్‌ని సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలోనే అల్లు అర‌వింద్‌కి తేజ ఈ క‌థ చెప్పాడు. వాస్త‌వానికి అల్లు అర‌వింద్ కూడా తేజ మంచి ఫాంలో ఉండ‌డంతో ఈ క‌థ‌తోనే త‌న కుమారుడిని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌నుకున్నాడు. కానీ ఈ క‌థ హీరో నితిన్‌కి చేర‌డంతో నితిన్ తొలి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు.

బొమ్మ‌రిల్లు

సిద్దార్థ హీరోగా వ‌చ్చిన ఆల్‌టైం క్లాసిక్ బొమ్మ‌రిల్లు సినిమాలో తొలుత అల్లు అర్జున్‌ని హీరోగా అనుకున్నారు. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ క‌థ చెప్ప‌గా అప్ప‌టికే హ్యాపీ సినిమా చేసిన బ‌న్నీ ఈ క‌థ వ‌ద్ద‌నుకున్నాడు. కానీ ఆ త‌రువాత ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. సిద్ధార్థ్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

భ‌ద్ర

డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ ద‌ర్శ‌కునిగా ఉన్న బోయ‌పాటి శ్రీ‌ను తాను రాసుకున్న భ‌ద్ర క‌థ‌ను అల్లు అర్జున్‌కి చెప్పారు. అప్పుడే ఆర్య లాంటి ప్రెష్ స్టోరీ చేస్తూ వెంట‌నే ఇంత యాక్ష‌న్ సినిమా ఎందుకు అని బ‌న్ని రిజెక్ట్ చేశాడ‌ట‌. ఈ సినిమా హీరో ర‌వితేజ చేసి త‌న ఖాతాలో వేసుకున్నాడు.
100 % ల‌వ్

ద‌ర్శ‌కుడు సుకుమార్ తాను రాసుకున్న క‌థ‌ను తొలుత బ‌న్నికి వినిపించాడ‌ట‌. ఈ క‌థ‌తో బ‌న్నీ అస్స‌లు క‌నెక్ట్ కాలేదు. ఈ సాప్ట్ ల‌వ్ స్టోరీ త‌న‌కు క‌నెక్ట్ కాద‌ని చెప్ప‌డంతో చివ‌రికీ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా నాగ‌చైత‌న్య హీరోగా వ‌చ్చి సూప‌ర్ హిట్ సాధించింది.

కృష్ణాష్ట‌మి :

సునీల్ హీరోగా వ‌చ్చిన కృష్ణాష్టమి సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు వాసువ‌ర్మ తొలుత బ‌న్నీకోస‌మే ల‌వ‌ర్ పేరుతో ఈ క‌థ రాశాడ‌ట‌. చివ‌రికీ అది కృష్ణాష్ట‌మి సునీల్ హీరోగా వ‌చ్చి ఫ్లాప్ అయింది.

పండ‌గ చేస్కో :

ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో పండ‌గ చేస్కో సినిమా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు తొలుత అల్లు అర్జున్‌కి క‌థ వినిపించార‌ట‌. కానీ రైట‌ర్ కోన వెంక‌ట్, గోపిచంద్ ఇద్ద‌రూ క‌లిసి చెప్పిన క‌థ‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాగుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. దీంతో రామ్ పోతినేని హీరోగా పండగ చేస్కో సినిమా వ‌చ్చింది.

Advertisement

అర్జున్ రెడ్డి :

సందీప్ రెడ్డి వంగా ఈ క‌థ‌ను తొలుత అల్లు అర్జున్‌కే వినిపించాడు. కానీ ఎందుకో ఏమో కానీ ఈ క‌థ‌న చేయ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయాడు. ఇదే సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడు సందీప్ వంగా.

గ్యాంగ్ లీడ‌ర్

మ‌నం లాంటి క్లాసిక్ సినిమాని తెర‌కెక్కించిన విక్ర‌మ్ కె కుమార్ నానితో గ్యాంగ్ లీడ‌ర్ సినిమా తీసాడు. ఈ సినిమా క‌థ బ‌న్నీతో అనుకున్న‌ప్ప‌టికీ ఆ త‌రువాత నానితో తెర‌కెక్కించాడు. బ‌న్నీకి క‌థ‌లో ప‌లు అనుమానాలు క‌లిగాయి. దీంతో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ హీరో నానితో ఈ సినిమా తీశారు. కానీ ఈ చిత్రం వ‌ర్క‌వుట్ కాలేద‌నే చెప్పాలి.

Also Read :  లవ్ లైఫ్ కోసం అవ్వని చెయ్యాలి.. అంత టైం లేదు నాకు..!
డిస్కోరాజా : 

విల‌క్ష‌ణ సినిమాల ద‌ర్శ‌కుడు ఆనంద్ డిస్కోరాజా సినిమాను అల్లు అర్జున్‌తో చేయాల‌నుకున్నాడు. ఈ చిత్రం క‌న్నా ముందు అల్లు శిరిష్‌తో ఒక్క‌క్ష‌ణం సినిమా తీశాడు. అప్పుడు బ‌న్నీతో ఉన్న చ‌నువు నేప‌థ్యంలో డిస్కోరాజా క‌థ‌ను బ‌న్నీకి చెప్ప‌గా.. ఈ క‌థ‌కి మ‌నోడు క‌నెక్ట్ కాలేదు. ఆ త‌రువాత ర‌వితేజ‌తో చేసినప్ప‌టికీ ఈ సినిమా డిజాస్ట‌ర్‌గానే మిగిలింది.

గీత గోవిందం

విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌న్నీ రిజెక్ట్ చేసిన అర్జున్‌రెడ్డి క‌థ‌తో హిట్ కొట్టాడు. ఆ త‌రువాత గోత గోవిందం క‌థ‌ను తొలుత ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం బ‌న్నికే చెప్పాడు. కానీ బ‌న్నీ ఆ క‌థ‌ను నిరాక‌రించాడు. ఇక ఆ త‌రువాత విజ‌య్ ఈ సినిమా చేసి సూప‌ర్ హిట్ సాధించాడు.

Also Read :  సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?

జాను

త‌మిళంలో సూప‌ర్ హిట్ సాధించిన 96 తెలుగు రీమేక్‌కు స‌మంత హీరోయిన్‌గా బ‌న్నీతో రీమెక్ చేయాల‌ని భావించాడ‌ట‌. కానీ అంత సాప్ట్ ల‌వ్ స్టోరీ తన‌కు సెట్ కాద‌ని బ‌న్నీ వ‌దులుకున్నార‌ట‌. ఇక శ‌ర్వానంద్-స‌మంత జంట‌గా జాను చేసిన‌ప్ప‌టికీ డిజాస్ట‌ర్ అయింది.

Also Read :  న‌ర‌సింహ‌నాయుడు సినిమాతో దేశంలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు సృష్టించిన బాల‌కృష్ణ‌..!

సుప్రీమ్ 

హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుప్రీమ్ సినిమా క‌థ తొలుత బ‌న్నీకే చెప్పాడ‌ట‌. అయితే బ‌న్నీకి ఆ క్యారెక్ట‌ర్ న‌చ్చలేద‌ట‌. దీంతో సాయిధ‌ర‌మ్ తేజ‌తో తెర‌కెక్కించాడు. ఆ సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది.

Also Read :  త్రివిక్ర‌మ్ తొలి సినిమాకి 20 ఏళ్లు.. ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్‌..!

Visitors Are Also Reading