Home » గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?

గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

రాంగోపాల్ వర్మ అంటే వివాదాల దర్శకుడు అనే పేరు ఇప్పుడు ఉంది కానీ, ఒకప్పుడు ఆయన కూడా స్టార్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటిన దర్శకుడు ఈయన. ఇలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఏ నిర్మాతకైనా ఉంటుంది. అదేవిధంగా మన స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా ఆశపడ్డారు. ఈ విధంగా గోవిందా గోవిందా మూవీ చేయాలనుకున్నారు. ఇందులో నాగార్జున హీరో,శ్రీదేవి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు.

Advertisement

అప్పటికే శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు నాగార్జున. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఖర్చులకు ఏమాత్రం వెనకాడకుండా అశ్విని దత్ పెట్టేసారు. కానీ సినిమా అనుకోకుండా ఫ్లాప్ అయిపోయింది. దీంతో ప్రొడ్యూసర్ చాలా నష్టపోయారు. కానీ అదే ఏడాది ఒక మీడియం రేంజ్ సినిమా అశ్వినీ దత్ ను గట్టెక్కించింది.ఆ సినిమానే శుభలగ్నం. గోవిందా గోవిందా 1994వ సంవత్సరం జనవరి 21 తేదీన థియేటర్ లోకి వస్తే, అదే ఏడాది సెప్టెంబర్ 30న శుభలగ్నం రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. అయితే గోవిందా గోవిందా సినిమాలో అద్భుతమైన కథాంశం, అలరించే పాటలు కనిపిస్తాయి.

Advertisement

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీకి సెన్సార్ బోర్డు తో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 50 శాతం సినిమాను కట్ చేయాలని వారు అన్నారు. చివరికి ఎలాగోలా చేసి అశ్వినీ దత్ సినిమాను రిలీజ్ చేయించారు. కానీ సినిమా భారీగా డిజాస్టర్ కావడంతో వైజయంతి సంస్థ ఆర్థికంగా కుదేలయింది. కానీ ఈ నష్టం నుంచి అశ్వనీదత్ ను ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో చేసిన శుభలగ్నం సినిమా భారీ హిట్ కొట్టి, గోవిందా గోవిందా సినిమా కి పెట్టిన బడ్జెట్ కవర్ అవడమే కాకుండా, శుభలగ్నం సినిమా కి పెట్టిన బడ్జెట్ కంటే పది రెట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ALSO READ;

Visitors Are Also Reading