Home » నెపోటిజంపై విజయ్ ఇలా మాట్లాడుతారనుకోలేదు.. నేను పడ్డ కష్టాలు వారికి ఉండవు..!!

నెపోటిజంపై విజయ్ ఇలా మాట్లాడుతారనుకోలేదు.. నేను పడ్డ కష్టాలు వారికి ఉండవు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చిత్ర పరిశ్రమలో నెపోటీజం అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారుతున్న విషయం. హీరోలకు సంబంధించిన వారసులు మాత్రమే ఎదిగే అవకాశం ఉంటుందని,మిగతా వారిని తొక్కేస్తున్నారనే వాదన ఉన్నది. అయితే తన సొంత శక్తి తో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు.. అది ఏంటో చూద్దాం.. తన సొంత టాలెంట్ తో ఎదిగిన విజయ్ దేవరకొండ రామ్ చరణ్,మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలను విమర్శించినట్టే ఈ కామెంట్స్ కనబడుతున్నాయి.

Advertisement

విజయ్ చేసిన ఈ కామెంట్స్ కు బండ్ల గణేష్ కూడా కౌంటర్ చేశారు.. పరిశ్రమలో తాతలు తండ్రులు ఉంటే సరిపోదని కొంత టాలెంట్ లేకుండా ఎవరు కూడా స్టార్ కాలేరని గణేష్ ట్వీట్ చేసారు.. అయితే కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ నెపోటిజం పై మీ అభిప్రాయం ఏంటని అడగగా ఇలా సమాధానమిచ్చారు. మన పుట్టుక ను మనం నిర్ణయించలేం.. అందం, ఆర్థిక స్తోమత, హైట్,వెయిట్ అనేది అందరికీ ఉండదు. ప్రస్తుతం స్టార్స్ వారసులుగా పుట్టిన వారు ఎవరైనా అనుకోకుండానే స్టార్ కిడ్స్ అయ్యారు. మనం ఎవరికి పుడుతామో మన చేతిలో లేదు.

Advertisement

రేపు నాకు పిల్లలు పుడితే వారు స్టార్ కిడ్స్ అవుతారు అనేది కూడా వారికి తెలియదు. మనం ఎప్పుడైనా సరే లక్ష్యం కోసం పోరాడాలి. దాన్ని సాధించడానికి కృషి చేయాలి కానీ , స్టార్ కిడ్స్ గా పుడితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మంచి స్టార్డం దొరుకుతుంది. నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులు పడ్డ కష్టాలు అవమానాలు, నటుడిగా ఎదగడానికి కారణమయ్యాయని విజయ్ దేవరకొండ అన్నారు. మొత్తానికి నెపోటిజానికి వ్యతిరేకంగా విజయ్ దేవరకొండ పరోక్షంగా సమాధానం ఇచ్చారని చెప్పవచ్చు. మొత్తానికి ఆ షో లో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ;

Visitors Are Also Reading