Home » చంద్రముఖి 2 లో 5గురు హీరోయిన్లు.. చంద్రముఖి పాత్ర చేసేది ఆమేనా..?

చంద్రముఖి 2 లో 5గురు హీరోయిన్లు.. చంద్రముఖి పాత్ర చేసేది ఆమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చంద్రముఖి అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది లక లక లక లక.. ఈ డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. 2005లో వచ్చిన ఈ సినిమా ఎవర్గ్రీన్ క్లాసిక్ తలైవా అభిమానులకు మర్చిపోలేని అనుభూతి కలిగించింది. మళ్లీ దీనికి సీక్వెల్ గా సూపర్ స్టార్ ని పెట్టి సినిమా తియ్యాలి అని దర్శకుడు పి.వాసు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడటం లేదట.. అయితే రెండో భాగాన్ని ఇప్పటికే కన్నడలో విష్ణువర్ధన్ చేసి సూపర్ హిట్ అయ్యారు. కాని తెలుగులో నాగవల్లి పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్ చేసిన సినిమా డిజాస్టర్ అయింది.

Advertisement

కానీ ఇప్పుడు దర్శకుడు చంద్ర కిట్టు సరికొత్త కథతో కొత్త హంగులతో ముందుకు రాబోతున్నారట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించబోతోంది. ఇందులో హీరోగా లారెన్స్ ను తీసుకుంటున్నారని, హీరోయిన్లుగా ఏకంగా ఐదుగురుని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంజిమా మోహన్, మహిమ నంబియర్, సృష్టి దంగే, సుభిక్ష కృష్ణన్, లక్ష్మీ మీనన్ లు లారెన్స్ సరసన నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మైసూర్లో ప్రారంభం కాగా, ఇందులో ముఖ్య పాత్ర అయిన చంద్రముఖి ఎవరనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

మొదటి భాగంలో నటించినట్లే జ్యోతికనే మళ్ళీ ఇందులో చేస్తున్నారనే ప్రచారం అవుతోంది. కానీ అఫీషియల్ గా మాత్రం బయటకు రాలేదు. రజనీకాంత్ చేసిన పాత్రలో ప్రవేశించ బోతున్న లారెన్స్ మీద అనేక అంచనాలు ఉన్నాయి. దీంతోపాటుగా చాలా ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కష్టమే. అందుకే దర్శకుడు వాసు మొదటి పార్టు తో ఏ సంబంధం లేకుండా డిఫరెంట్ లుక్ లో సినిమాను చేస్తున్నారని తెలుస్తోంది.

ALSO READ;

Visitors Are Also Reading