Home » షర్మిల-డీకేల మధ్య ఢీల్ కుదిరిందా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే..?

షర్మిల-డీకేల మధ్య ఢీల్ కుదిరిందా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల బెంగళూరులో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ముచ్చటించారు. అయితే వీరి మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీలో షర్మిలాను ఏ విధంగానైనా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఏపీలో షర్మిల కు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఏఐసిసి భావిస్తున్నట్టు సమాచారం. అయితే తెలంగాణలో వైయస్సార్సీపి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని వారు కోరినట్టు తెలుస్తోంది.

Advertisement

స్వయంగా ప్రియాంక గాందే ఈ ప్రతిపాదన చేశారని డీకే శివకుమార్ వైయస్ షర్మిలకు వివరించారు. అటు ఏఐసీసీ,ఇటు షర్మిల మధ్య సమన్వయకర్తగా డీకే శివకుమార్ ను పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిమధ్య మర్యాదపూర్వకంగా భేటీ జరిగిన కానీ కీలకమైన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

ఒకవేళ వైయస్ఆర్టిపి పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మీ చేతిలో పెడతామని డీకే శివకుమార్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి షర్మిల ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది జరిగితే మాత్రం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading