Home » అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

by Anji
Ad

గత కొద్ది రోజుల నుంచి యాంకర్ అనసూయ, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ట్విట్టర్ లో యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత విజయ్ దేవరకొండ పేరుకి  ముందు ది అని పెట్టుకున్నాడు. దాని మీద అనసూయ సెటైరికల్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు సమాధానంగా విజయ్ అభిమానులు అనసూయని ట్రోల్ చేశారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఎప్పుడో అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు విజయ్ దేవరకొండ ఏదో చెడ్డ పదం అన్నాడని  దాని మీద కామెంట్ చేసింది అనసూయ. అప్పట్లో అనసూయ ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా ఉండేది. ఆడవాళ్ళకి సంబంధించిన ఆర్గనైజషన్స్ కూడా ఆ షోనీ నియంత్రించాలని, ఎందుకంటే అందులో ఆడవాళ్ళని కించపరిచే విధంగా, ఇంకా బూతులు కూడా ఎక్కువ అయ్యాయని అన్నారు. అలాంటి వల్గారిటీ ఉన్న షోకి యాంకరింగ్ చేసిన అనసూయ, విజయ్ దేవరకొండ సినిమా డైలాగ్స్ మీద కామెంట్ చేస్తే ఎలా అని విరుచుకుపడ్డారు విజయ్ అభిమానులు. విజయ్ మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించి అందులో అనసూయ కి కూడా ఒక మంచి పాత్ర ఇచ్చి ఆ సినిమాలోకి తీసుకున్నాడు. 

 

Advertisement

ఆ సినిమాతో పాత గొడవలు ఇద్దరు మర్చిపోయారు అని అందరూ అనుకున్నారు.కానీ  మళ్లీ లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అనసూయ చాలా హ్యాపీ ఫీల్ అయింది అని తెలిసింది. వెంటనే ట్వీట్ కూడా చేసింది. అయితే ఆ ట్వీట్ చాలా వెటకారంగా విజయ్ ని పరోక్షంగా విమర్శించినట్టుగా చేసింది. దీంతో మళ్ళీ విజయ్ అభిమానులు అనసూయని ట్రోల్ చేశారు. ఆంటీ అన్న పదం కూడా అప్పుడే వచ్చింది. ఆమె సీరియస్ అవ్వటం, విజయ్ అభిమానులు ట్రోల్ చేయటం ఇలా మళ్లీ మొదలైంది. అది కూడా కాలంతోపాటు మర్చిపోయారు అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు విజయ్ పేరు ముందు ది అని పెట్టుకున్నాడు. అసలు చెప్పాలంటే అనసూయకి అది సంబంధమే లేదు.  కావాలంటే ఆమె కూడా పెట్టుకోవచ్చు. ఈమె ఎవరు అడగడానికి అని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. కానీ దాని మీద వెటకారంగా ట్వీట్ చేసింది అనసూయ.

ఇంకో ట్రీట్ కూడా దొంగ.. అని ఆపేసింది. అది ఒక తిట్టు అని తెలుగు తెలిసిన ఎవరికైనా అర్థం అయిపోతుంది. అందులోనే బంగారు కొండలంట.. అంటూ వెటకారంగా పెట్టింది. ఇంతకీ మళ్ళీ ఏమైంది అంటే..  ఏదో పార్టీలో విజయ్ అనసూయ భర్త భరద్వాజ్ కి మధ్యలో ఏవో మాటల యుద్ధం జరిగింది అని  పేర్కొంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది  తెలియదు. భర్తని ఏదో అన్నాడని రివెంజ్ తీర్చుకోవాలనే  మళ్లీ విజయ్ మీద అలా చేసింది  అంటున్నారు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు. 

Also Read :  అత్యధిక లాభాలను తెచ్చుకున్న టాప్ 5 తెలుగు మూవీలు ఇవే..!

Visitors Are Also Reading