Telugu News » Blog » సౌంద‌ర్య ఎక్స్‌పోజింగ్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా..? విస్తుపోయే విష‌యాలు వెల్ల‌డించిన నటి ఆమ‌ని..!

సౌంద‌ర్య ఎక్స్‌పోజింగ్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా..? విస్తుపోయే విష‌యాలు వెల్ల‌డించిన నటి ఆమ‌ని..!

by Anji
Ads

సినీ న‌టి సౌంద‌ర్య గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సౌంద‌ర్య క‌న్న‌డ న‌టీ అయిన‌ప్ప‌టికీ ఆమె తెలుగులో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున‌, బాల‌కృష ఇలా అంద‌రూ హీరోల‌తో నటించి విశేష‌మైన తెలుగు ప్రేక్ష‌కాభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆమె ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌కు త‌గిన న్యాయం చేసేవారు. సౌంద‌ర్య‌ను చూసి అప్ప‌ట్లో మ‌రో సావిత్రి అని పిలిచేవార‌ట‌. అయితే ఈమె ఎంత తొంద‌ర‌గా సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారో అంతే తొంద‌ర‌గా ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లారు. సౌంద‌ర్య 50వ జ‌యంతి సంద‌ర్భంగా అభిమానులు ఆమెను మ‌రోసారి గుర్తుకు చేసుకున్నారు.

Ads

ఇక సౌంద‌ర్య జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌ని సౌంద‌ర్య గురించి మాట్లాడారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపారు. సౌంద‌ర్య సినిమాల్లో ఎలాంటి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు తావు లేకుండా ఎంతో సంప్రదాయమైన అమ్మాయిలా క‌నిపిస్తూ న‌టించేది. సౌంద‌ర్య పాటు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేస్తూ దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఈమె మాత్రం త‌న ప‌రిధి దాటి ఎప్పుడు కూడా న‌టించ‌లేదు. ఈ త‌రుణంలోనే న‌టి ఆమ‌ని మాట్లాడుతూ.. తాను న‌టించిన ప‌లు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేశాను.కానీ సౌంద‌ర్య మాత్రం ఎప్పుడు అలా న‌టించ‌లేదు. ఎక్స్‌పోజింగ్ పాత్ర‌ల్లో ఎందుకు న‌టించ‌వ‌ని సౌంద‌ర్య‌ను అడిగిన‌ప్పుడు ఆమె ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింద‌ని ఆమ‌ని గుర్తు చేశారు.

Ads


ప్ర‌స్తుతం తాను ఎక్స్‌పోజింగ్ చేస్తూ సినిమాలు చేస్తే రేపు నాకు పెళ్లి అయిన త‌రువాత నా భ‌ర్త ఎందుకు అలాంటి పాత్ర‌ల్లో న‌టించావ‌ని ప్ర‌శ్నిస్తే..? స‌మాధానం ఏమి చెప్పాల‌నేది. రేపు నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ వారు నా సినిమాల‌ను చూసి సంతోషంగా ఉండాల‌ని స‌మాధానం చెప్పింది. ఒక వేళ మ‌నం ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలు చేస్తే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మ‌న సినిమాల‌ను మ‌నం చూడాలంటే సిగ్గుప‌డాల్సి వ‌స్తుంద‌ని చెప్పేది. ప్ర‌స్తుతం నా న‌ట‌న వ‌ల్ల రేపు నా ఫ్యామిలీ ఇబ్బంది ప‌డ‌కూడ‌దు అని సౌంద‌ర్య చెప్పినట్టు ఆమ‌ని వెల్ల‌డించారు.

Also Read : 

పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకాలలో 4 పెళ్లిళ్లు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు….!

Ad

ప్రముఖ విలన్ రఘువరన్ కొడుకు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. !