Home » పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకాలలో 4 పెళ్లిళ్లు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు….!

పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకాలలో 4 పెళ్లిళ్లు….వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు….!

by AJAY
Published: Last Updated on
Ad

వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్య నిపుణులుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి పాపులారిటీ సంపాదించుకున్నారు. సమంత నాగ చైతన్య విడిపోతారని వేణు స్వామి ముందే జోష్యం చెప్పారు. వేణు స్వామి చెప్పినట్టుగానే సమంత చైతూ విడిపోవడంతో ఆయన జ్యోతిష్యాన్ని నమ్మే వారి సంఖ్య కూడా పెరిగింది. అంతేకాకుండా హీరోయిన్ రష్మిక సైతం వేణు స్వామిని ఇంటికి పిలిపించుకుని మరీ పూజలు జరిపించారు.

Advertisement

 

ఆ తర్వాతే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిందని వేణు స్వామి చెప్పుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అచ్చిరావని కూడా వేణు స్వామి అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ శ్రీజలు వేరువేరుగా ఉంటున్నారని త్వరలోనే విడాకులను అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ క్రమంలో వేణు స్వామి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుందని తన స్నేహితుడిని శ్రీజ పెళ్లి చేసుకుంటుందని వేణు స్వామి జోష్యం చెప్పారు. అంతేకాకుండా శ్రీజ జాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడని కాబట్టి శ్రీజ మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని కామెంట్ చేశారు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ శ్రీజల జాతకం ఒకే విధంగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ జాతకంలో కూడా కుజుడు నీచం లో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వేణు స్వామి వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading