Home » వారసుడు చిత్రం వాయిదా వేయడానికి కారణం అదేనా..?

వారసుడు చిత్రం వాయిదా వేయడానికి కారణం అదేనా..?

by Anji

సంక్రాంతి పండుగకి తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలుత వారసుడు జనవరి 12న తెలుగు, తమిళంలో విడుదల చేయాలని భావించారు నిర్మాత దిల్ రాజు. ఆ తరువాత తమిళంలో అజిత్ నటించిన తునివు సినిమా కూడా విడుదల కానుండడంతో దిల్ రాజు కూడా తమిళంలో జనవరి 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో వారసుడు అనే టైటిల్ తో డబ్బింగ్ చేశారు.  సంక్రాంతి కానుకగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. వారసుడు జనవరి 14న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్ర నిర్మాత దిల్ రాజు విలేకర్ల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. “పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నా మీద అందరూ పడి ఏడ్చేస్తున్నారు. అందుకోసమే నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. తెలుగులో జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళంలో మాత్రం యథావిధిగా జనవరి 11న విడుదలవుతున్నట్టు ప్రకటించారు దిల్ రాజు. తెలుగులో సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ప్రధానంగా అగ్ర హీరోలు అయినటువంటి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువగా థియేటర్లు అవసరం కావడంతో  నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను. నిర్మాతలందరూ బాగుండాలి. ఓ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాను. నాకు బాల కృష్ణ, చిరంజీవి గారు ఇంపార్టెంట్ “అని చెప్పినట్టు గుర్తు చేశారు దిల్ రాజు. 

Also Read :  లక్ష్మి పార్వతి: అలా అయితేనే jr..ఎన్టీఆర్ టిడిపికి సపోర్ట్ చేస్తారట..!!

ఇక ఈ సినిమాపై 100 శాతం నమ్మకం ఉందని.. గతంలో తమ బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానంభవతి, ఎఫ్2 సినిమాల మాదిరిగానే వారసుడు కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ కథా చిత్రమే అయినప్పటికీ ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంటుందని.. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన అందరూ ఈ పాయింట్ ని మాత్రమే గుర్తుంచుకుంటారని తెలిపారు దిల్ రాజు. ఈసినిమాలో విజయ్ దళపతి సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శరత్ కుమార్, కిక్ శ్యామ్, సంగీత, జయసుధ, ఖుష్బూ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read :  విజయ్ కి బిగ్ షాక్ “వారసుడు” స్టోరీ లీక్.. స్టోరీ కొత్తగా ఉందిగా !

Visitors Are Also Reading