Home » అమెజాన్ ప్రైమ్ నుంచి “HIT 2”తొలగించడానికి అసలు కారణం అదేనా..?

అమెజాన్ ప్రైమ్ నుంచి “HIT 2”తొలగించడానికి అసలు కారణం అదేనా..?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైనటువంటి అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 02, 2022న థియేటర్లలో విడుదలైంది. హిట్ ది ఫస్ట్ కేస్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ విడుదల చేశారు. అదేవిధంగా ఓవర్సిస్ లో కూడా మంచి వసూళ్లను సాధించారు. మేజర్ సినిమా తరువాత అడివి శేష్ హిట్ 2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

ఇక హిట్ 2 సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. మరోవైపు రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్ కూడా పోటీ పడింది. కానీ అధిక మొత్తం చెల్లించి అమెజాన్ ప్రైమ్ తన సొంతం చేసుకుంది. హిట్ సినిమాను జనవరి 04, 2023న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేసింది. అయితే రెంట్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి దీనిని తొలగించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కనిపించడం లేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ జనవరి 06, 2023 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. ముందస్తుగానే స్ట్రీమింగ్ కి ఉంచింది. ఇక ఆ తరువాత ఎలాంటి అప్ డేట్ లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి  ఈ సినిమాను తొలగించింది. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Advertisement

Also Read :   తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

ముందస్తుగా ఎందుకు విడుదల చేశారు..? అసలు ఎందుకు తొలగించారు ? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తొలగించడానికి సంబంధించి ఎలాంటి వివరన ఇవ్వకపోవడం గమనార్హం. ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 06 నుంచి హిట్ 2 స్ట్రీమింగ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 వచ్చింది. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. హిట్ 2 లో అడివిశేష్ హీరోగా కనిపించారు. మరోవైపు హిట్ 3 లో నాని హీరోగా కనిపించనున్నట్టు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి పెద్దగా డిస్కర్షన్ జరగకపోయినా.. సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. అడివిశేష్ తన సినిమాలకు తనే కథలు రాసుకుంటూ.. మంచి సక్సెస్ సాధిస్తున్నారు. 

Also Read :  హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

Visitors Are Also Reading