Home » తొలుత ఫ్లాప్ టాక్ సంపాదించుకొని చివరికీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మెగాస్టార్ మూవీ అదేనా..?

తొలుత ఫ్లాప్ టాక్ సంపాదించుకొని చివరికీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మెగాస్టార్ మూవీ అదేనా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చినటువంటి స్టార్ హీరోలలో ఒకరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అగ్రస్థాయి హీరోగా ఎదిగారు. ప్రాణంఖరీదు సినిమాలో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.అందులో ఒకటి మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై నిర్మాత సుబ్బిరామిరెడ్డి సారథ్యంలో రిలీజ్ అయిన మూవీ స్టేట్ రౌడి. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. 

Advertisement

ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా రాధ, భానుప్రియ నటించారు. మార్చి 23, 1989లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొత్తలో ఈ మూవీ ప్లాఫ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమానే కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద వర్షాన్ని కురిపించిందని చెప్పాలి. అప్పట్లో స్టేట్ రౌడీ సినిమా నైజాంలో కోటిరూపాయలకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. స్టైట్ రౌడి విడుదలైన సమయంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ సినిమాలు అంటే.. నిర్మాతలకు కాసులు కురిపించేవి. చిరంజీవి స్టేట్ రౌడీ చిత్రంతో అమితాబచ్చన్ సినిమా కలెక్షన్లకు మించి వసూలు చేయడం విశేషం. అప్పట్లోనే ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Advertisement

చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ భారీ కలెక్షన్లు సాధించడంతో ట్రేడ్ గైడ్ మ్యాగజిన్ స్టేట్ రౌడీ చిత్రం కలక్షన్ల గురించి వివరిస్తూ వేర్ ఈజ్ అమితాబ్ అంటూ ప్రశ్నిస్తూ.. ఓ ఆర్టికల్ కూడా విడుదల చేసింది. అప్పట్లో ఈ మ్యాగజైన్ చదివిన పలువురు హిందీ ప్రముఖులు సైతం వేర్ ఈజ్ అమితాబ్ అనే పదాన్ని చదివి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. ఇక ఆ సమయంలో స్టేట్ రౌడీ మూవీ దేశం మొత్తం రికార్డుల పరంగా సంచలనమే సృష్టించింది. అంతేకాదు.. వంద రోజుల వేడుక కూడా ఘనంగా జరుపుకోవడంతో పాటు చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది స్టేట్ రౌడీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కేజీఎఫ్ మూవీలో రాఖీభాయ్ పాత్రను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా..? కారణం ఏంటంటే..?

నయనతార, ప్రభుదేవా ఆ కారణం వల్లనే విడిపోయారా..? అలా జరిగిందా..!

Visitors Are Also Reading