Home » కేజీఎఫ్ మూవీలో రాఖీభాయ్ పాత్రను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా..? కారణం ఏంటంటే..?

కేజీఎఫ్ మూవీలో రాఖీభాయ్ పాత్రను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా..? కారణం ఏంటంటే..?

by Anji
Ad

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నార్త్ అండ్ సౌత్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అంతేకాదు.. నార్త్ లో కూడా హిందీ మూవీల రికార్డులను బ్రేక్ చేసింది. బాలీవుడ్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. కేవలం కేజీఎఫ్ సినిమాతోనే కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.  యశ్ మూడేండ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో.. కానీ కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కేజీఎఫ్ తో పాటు కేజీఎఫ్ 2 కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

Advertisement

ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ కి ఎంత పెద్ద గుర్తింపు లభించిందో అందరికీ తెలిసిందే. హీరో పాత్రలో యశ్ కాకుండా మరెవ్వరు చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. ఈ సినిమాలో తొలుత వేరే స్టార్ హీరోని అనుకున్నారట. ప్రశాంత్ నీల్ ఈ కథ అనుకున్నప్పుడు ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తే బాగుంటుందనుకొని హీరో హృతిక్ రోషన్ ని కలిసేందుకు ప్రయత్నించారట. కానీ హృతిక్ రోషన్ అపాయింట్ మెంట్ లభించలేదట. 

Advertisement

దీంతో కన్నడ ఇండస్ట్రీ ఎంత గొప్పదో పాన్ ఇండియా లెవల్ లో చెప్పాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే కన్నడ హీరోతోనే ఎలాగైనా సరే ఈ సినిమా చేయాలనుకున్నారట. దర్శకుడు అనుకున్నట్టే యశ్ తో ఈ మూవీ చేశారు. ఈ సినిమా ఫలితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో హీరో యశ్ కూడా చాలా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నట్టు శాండల్ వుడ్ పేరుతో బాలీవుడ్ కే కాదు.. హాలీవుడ్ కి కూడా పరిచయం చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మెగాస్టార్ మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా ? 

నయనతార, ప్రభుదేవా ఆ కారణం వల్లనే విడిపోయారా..? అలా జరిగిందా..!

Visitors Are Also Reading