Home » వామ్మో సమంత మామూల్ది కాదు.. ఇంతలోనే నాగచైతన్య ప్లేసును ఆ హీరోకి ఇస్తోందా..?

వామ్మో సమంత మామూల్ది కాదు.. ఇంతలోనే నాగచైతన్య ప్లేసును ఆ హీరోకి ఇస్తోందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ సమంత అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలివితో పాటు బాలీవుడ్ లో కూడా తిష్ట వేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం చాలా కసరత్తు చేస్తోంది. టాలీవుడ్ కు సంబంధించి ఖుషి సినిమా శివ నిర్వాణ డైరెక్షన్లో రాబోతున్న విజయ్ దేవరకొండ సరసన సమంత కనిపించబోతోంది. ప్రస్తుతం ఆమె ముందున్న మెయిన్ ప్రాజెక్టులు ఇవే.\

Advertisement

వీటి పైన ఆమె భారీగా ఆశ పెట్టుకుంది. ఈ మధ్యనే ఆమె నటించినటువంటి శాకుంతలం మూవీ భారీ డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలుసు. కానీ రాబోవు రెండు సినిమాలు ఎలాగైనా హిట్ సాధించాలని చాలా కష్టపడుతోందట. ఒకవేళ రెండు హిట్ అయితే మాత్రం బాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో ఒక చిత్రం చేస్తోందట. వీరిద్దరి కాంబినేషన్లో ఓ బేబీ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. నాగచైతన్య సమంత కలిసి ఉన్న టైం లోనే నందిని రెడ్డి కథను వినిపించింది. వారికి నచ్చిందట కూడా.

Advertisement

కానీ ఇంతలోనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో ఆ కథ మరుగున పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు నందిని రెడ్డి ఆ చిత్రాన్ని సమంతతో తీయాలని ప్రయత్నాలు చేస్తుందట. ఇక సమంత హీరోయిన్ ఓకే కానీ, హీరోగా నాగచైతన్య ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకు వెతుకుతుందట. అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య ప్లేసును డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ రిప్లేస్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి సమంత కూడా అంగీకారం తెలిపినట్టు టాక్. ఈచిత్రాన్ని రాం తాలూరి నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading