Home » Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

by Bunty
Ad

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. హీరో శర్వానంద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం విధితమే. ఈ ఏడాది ప్రారంభంలోనే యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది.

Sharwanand

ఇరు కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీల సమక్షంలో వీళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితి రావు హైదరి వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా, తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement

Advertisement

ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే శర్వానంద్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఇక జూన్ 3న శర్వానంద్ పెళ్లి జరగనుంది. దీంతో శర్వానంద్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో శర్వానంద్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపినట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ

Visitors Are Also Reading