Home » ఫ్లాప్ టాక్ తో టాప్ లో నిలిచిన చిరంజీవి మూవీ… ఎన్ని కలెక్షన్లో తెలిస్తే షాక్ అవుతారు..!

ఫ్లాప్ టాక్ తో టాప్ లో నిలిచిన చిరంజీవి మూవీ… ఎన్ని కలెక్షన్లో తెలిస్తే షాక్ అవుతారు..!

by AJAY
Ad

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు మొదట ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వారికి ఉన్న క్రేజ్ కారణంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ఉంటాయి. అలా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది స్టార్ హీరోలకు జరిగింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇలాంటి సందర్భం ఒకటి ఉంది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధా హీరోయిన్గా బి గోపాల్ దర్శకత్వంలో స్టేట్ రౌడీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసింది. సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి బప్పీ లహరి సంగీతం అందించాడు. ఈ సినిమా 1989వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

Advertisement

దానితో ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడం కష్టమే అని… ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజుతో పోలిస్తే ఆ తర్వాతి రోజుల్లో రోజురోజుకు పుంజుకోవడం మొదలు పెట్టింది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ రేంజ్ కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమా ఆ సమయంలో కేవలం నైజాం ఏరియాలోనే కోటి రూపాయల కలక్షన్లను వసూలు చేసింది. అప్పటివరకు ఏ సినిమా కూడా నైజాం ఏరియాలో కోటి రూపాయల కలక్షన్లను వసూలు చేయలేదు. అలా విడుదల అయిన మొదటి రోజు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకొని నైజాం ఏరియాలో కోటి రూపాయల కలక్షన్ వసూలు చేసి ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక అరుదైన మూవీగా నిలిచింది.

Visitors Are Also Reading