Home » పవన్ కళ్యాణ్ ఆ హీరోలందరినీ కలవబోతున్నాడా.. నెక్ట్స్ తన ప్లాన్ అదేనా..?

పవన్ కళ్యాణ్ ఆ హీరోలందరినీ కలవబోతున్నాడా.. నెక్ట్స్ తన ప్లాన్ అదేనా..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే వారాహి యాత్రను ప్రారంభించిన పవన్.. రాష్ట్రంలోని పలు జిల్లాలను, గ్రామాలను సందర్శిస్తున్నారు.  ఎక్కడ  నెగ్గాలనుకుంటే..  అక్కడ తగ్గాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్. 

Advertisement

పాత వివాదాలను తవ్వి తీసి మరీ తన అభిమానుల తరపున స్వయంగా క్షమాపణ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి దాదాపు దశాబ్దం కావొస్తుంది. అసలు ఇన్నేళ్లయ్యాయా..? అని పవన్ నోట రాని కొత్త వ్యాఖ్యలు చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఎజెండాకి సంబంధించింది.. ఇందుకు సినిమా అనే అంశాన్ని ముడిపెట్టడం మంచిది కాదనే చెప్పాలి. టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలందరినీ కలిసి తనకు సహకరించాలని కోరబోతున్నాడట.

Advertisement

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలను మినహా.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోయి ఇప్పటికే యూత్ లో భారీగా ఫాలోయింగ్ ఉన్న వారే. మరోవైపు సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలయ్యబాబు, అక్కినేని  నాగార్జున, విక్టరీ వెంకటేష్ తో పాటు మాస్ మహారాజా రవితేజ వంటి కొంత మంది అగ్రహీరోలున్నారు. వీరిలో కొంత మందిని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంలో కలిసే అవకాశముందని వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి.  దీంతో అభిమానుల మధ్య సఖ్యత కుదిర్చే క్రమంలో ఇతర హీరోలతో పవన్ భేటీ కూడా చాలా కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ విషయంపై త్వరలోనే  క్లారిటీ రావాల్సి ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

దిల్ రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

నిహారిక, చైతన్య విడాకులకు క్లారిటీ వచ్చేసిందా..? అందుకోసమే వారు విడాకులు తీసుకుంటున్నారా..?

 హీరోయిన్ రెబా మోనికకి ఈ స్టార్ హీరోయిన్ బంధువా..?

Visitors Are Also Reading