Home » Chiranjeevi and Balakrishna: ఆ విషయంలో చిరంజీవి కంటే బాలకృష్ణనే చాలా బెటరా..?

Chiranjeevi and Balakrishna: ఆ విషయంలో చిరంజీవి కంటే బాలకృష్ణనే చాలా బెటరా..?

by Anji
Published: Last Updated on

సీనియర్ హీరోలు.. యంగ్ రోల్స్ యాక్ట్ చేస్తూ హీరోయిన్లతో రొ*మాన్స్ చేస్తూ డ్యూయేట్స్ చేస్తే యాక్సెప్ట్ చేసే రోజులు కావు ఇవి.. తమ ఏజ్ కి తగిన క్యారెక్టర్స్..ఇమేజ్ కి తగ్గ స్టోరీస్ తో వస్తే.. బ్లాక్ బస్టర్స్ వస్తాయనడానికి ఇటీవలే వచ్చిన జైలర్ మూవీ ఓ మంచి ఉదాహరణ అనే చెప్పవచ్చు. 

 

సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి చాలా మంది సీనియర్ హీరోలు చాలా కాలంగా ఈ హీరోలకు కమర్షయల్ ఎలిమెంట్స్ ప్రిపరెనస్ ఇవ్వకుండా కంటెంట్ ఉన్న కథలతో ఏజ్ తో సంబంధం లేకుండా తగిన రోల్స్ చేస్తున్నారు.

తెలుగు సీనియర్ హీరోలు మాత్రం ఈ విషయంలో కొంచెం అప్ డేట్ అనే చెప్పాలి. తాాజాగా విడుదలైన బాలకృష్ణ  భగవంత్ కేసరి  మూవీ చూస్తే.. ఈ అభిప్రాయం మారుతుంది. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో రూపొందిన  భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లో మంచి యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా డెలివర్ చేశాడు.

ఈ రెండు విషయాల్లో చిరంజీవి కంటే బాలకృష్ణ చాలా బెటర్ అని చెప్పచ్చు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు అవుతున్నా కూడా చిరంజీవి ఇప్పటికి కూడా సెటిల్ యాక్టింగ్ చేయలేకపోతున్నాడని ఫ్యాన్స్ సైతం అంటున్న మాట. కూతురు సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య, శ్రీలీల పర్ఫార్మెన్స్ క్రిటిక్స్ సైతం ఫిదా అవుతున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీలో శ్రీకాకుళం స్లాంగ్, బోళాశంకర్ మూవీలో తెలంగాణ స్లాంగ్ చెప్పిన డైలాగ్స్ చాలా ఆర్టీఫిషియల్ గా అనిపించిన నేపథ్యంలో.. స్లాంగ్ విషయంలో కానీ.. యాక్టింగ్ విషయంలో చిరంజీవి కన్నా బాలకృష్ణ చాలా బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించడం గమనార్హం. 

Visitors Are Also Reading