Home » రజినీకాంత్ కి అంతా తెలిసే ఆ సినిమాకి ఒప్పుకున్నాడా..?

రజినీకాంత్ కి అంతా తెలిసే ఆ సినిమాకి ఒప్పుకున్నాడా..?

by Anji
Ad

కోణాన్ని చూపడమే కాదు, హర్రర్ కాన్సెప్ట్ సినిమాలకు ఒక దిక్సూచిగా మారింది. చంద్రముఖి తర్వాత హర్రర్ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటి అన్నింటికీ చంద్రముఖినే మూలమని చెప్పొచ్చు. అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే రజినీకాంత్ ఎందుకు వదులుకుంటాడు? కానీ వదులుకున్నాడు. మరి ఎందుకు వదులుకున్నాడు? ఈ ప్రశ్న చాలా రోజులపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనికి సమాధానాన్ని డైరెక్టర్ పి.వాసు ప్రమోషన్స్ సమయంలోనే చెప్పే ప్రయత్నం చేశాడు.

Advertisement

చంద్రముఖి 2 స్టోరీని ముందుగా రజినీకాంత్ వద్దకే తీసుకెళ్లానని, కథ విన్న తర్వాత, వెంకయ్య రాజు పాత్ర తన కంటే, రాఘవ లారెన్స్ కి బాగా సెట్ అవుతుందని చెప్పినట్టు డైరెక్టర్ పి.వాసు చెప్పాడు. అందుకే రజనీకాంత్ ప్లేస్ లో లారెన్స్ ను తీసుకున్నట్టు అలా వివరించాడు. ఇప్పుడు చంద్రముఖి 2 రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడం స్టార్ట్ అయింది. దీంతో ఓ ఫ్లాప్ సినిమా నుంచి రజినీకాంత్ తప్పించుకున్నాడు అంటూ సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. చంద్రముఖి 2 కథలో కొత్తదనం ఏమీ లేదని, చంద్రముఖినే మళ్లీ రిలీజ్ చేసినట్టు ఉందని అంటున్నారు.

Advertisement


అయితే ఇక్కడ ఒక టాక్ నడుస్తుంది. చంద్రముఖి 2 స్టోరీ చంద్రముఖి లానే ఉందని రజినీకాంత్ కి తెలుసని, అందుకే దాన్ని రిజెక్ట్ చేసి, రాఘవ లారెన్స్ ని బలి చేశాడు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కథ విన్నప్పుడు అందులో కొన్ని మార్పులు సూచించాల్సి ఉందని అంటున్నారు. కాగా చంద్రముఖి 2 ఫస్ట్ డే దాదాపు 7.5 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే, 45 కోట్ల వరకు రావాలి. ప్రస్తుతం ఉన్న టాక్ ను బట్టి చూస్తే అది కష్టమే అని చెప్పొచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?

 ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణే ముందున్నాడా..?

Visitors Are Also Reading