Home » క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు బిగ్ షాక్…విదేశాల్లోనే ఐపీఎల్ 2024…?

క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు బిగ్ షాక్…విదేశాల్లోనే ఐపీఎల్ 2024…?

by Bunty
Ad

ఇండియాలో ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. భారత్ లో ఐపీఎల్ జరిగితే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో వచ్చి చూస్తూ ఉంటారు. కోట్లాదిమంది టీవీలు చూస్తూ ఉంటారు. 2023 ఐపీఎల్ ఇండియాలో నిర్వహించారు. ఈ సీజన్ అన్నింటికన్నా సూపర్ హిట్ అయ్యింది. 2024 ఐపిఎల్ ను మరింత ఎక్కువ సక్సెస్ చేయడానికి బీసీసీఐ భావిస్తోంది. కానీ ఇప్పుడు బీసీసీఐకి, ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. వచ్చే సంవత్సరం ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగే అవకాశాలు లేవు. దానికి గల కారణం… వచ్చే సంవత్సరం ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఐపీఎల్ కు భద్రత ఇవ్వడం ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది.

Advertisement

దాంతో ఆ సంవత్సరం ఐపిఎల్ నిర్వహణ సాధ్యపడదు. అందుకే వచ్చే సంవత్సరం సీజన్ విదేశాలలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలతో పాటు టి20 వరల్డ్ కప్ కూడా జరగబోతోంది. టి20 వరల్డ్ కప్ జూన్ లో జరగనుంది. కాబట్టి అంతకంటే ముందే ఐపిఎల్ ను నిర్వహించాలి. అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఏప్రిల్ వరకు టోర్నిని ముగించాలి. ఇక మార్చిలో ఎన్నికల కోడ్ వస్తే ఐపీఎల్ ను నిర్వహించడం సాధ్యం కాదు. గతంలో కూడా 2009, 2014 ఎన్నికల సమయంలో ఐపీల్ ను విదేశాల్లో జరిపించారు. ఇప్పుడు 2024 ఐపీఎల్ ను కూడా విదేశాల్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వల్ల, కోవిడ్ వల్ల ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించారు.

Advertisement

ఒకవేళ 2024లో ఇండియాలో ఐపీఎల్ సాధ్యం కాకపోతే యూఏఈ లో, సౌత్ ఆఫ్రికాలో టోర్నీ జరిపించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ లో నిర్వహించింది. దీనిపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ లో మినీవేలం జరగనుంది. ఆ లోపు టోర్ని నిర్వహణ కూడా ఎక్కడ అనేది బీసీసీఐ ఖరారు చేయనుంది. 2008లో మొదలైన ఐపిఎల్ ను ఎన్ని అవాంతరాలు ఎదురైనా బీసీసీఐ ఆపడం లేదు. భారతదేశంలో వీలు కాకపోయినా ఇతర దేశాలలో నిర్వహించడానికి బీసీసీఐ అధికారులు సిద్ధంగా ఉంటారు. ఐపీఎల్ ద్వారా ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి, ప్రసార హక్కుల వారికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ టోర్నీని నిర్వహించాలని డిసైడ్ అయ్యింది బీసీసీఐ. మరి ఎన్నికలు టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో 2024 ఐపీఎల్ ను ముందుగా నిర్వహిస్తారా లేక విదేశాలకు తరలిస్తారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

 

Visitors Are Also Reading