Home » ఐపీఎల్ మినీ వేలానికి అంతా సిద్ధం.. ఏ జట్టు వ్యాలెట్‌లో ఎంత ఉందో తెలుసా..?

ఐపీఎల్ మినీ వేలానికి అంతా సిద్ధం.. ఏ జట్టు వ్యాలెట్‌లో ఎంత ఉందో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ నే వేరు ఉంటుంది. సాధారణంగా కనిపించని మజా ఐపీఎల్ లో కనిపిస్తుంది. అన్ని దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు ఒక టీమ్ లో ఉండడం ఒక ఎత్తయితే.. ఆటగాళ్లు భారీ పరుగులు సాధించడం మరో ఎత్తు. సగటు ప్రేక్షకుడికి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది ఐపీఎల్. ఇక ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లు గడువు తేదీకి   ముందే జాబితా విడుదల చేసాయి. డిసెంబర్ 23న కొచ్చిలో జరుగనున్న వేలానికి ముందు రిటెన్షన్, రిలీజ్ జాబితాను సిద్ధం చేశారు. ఇక అదే సమయంలో ఏ జట్టు వ్యాలెట్ లో ఎంత ఉందో కూడా తేలిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యాలెట్ లో  అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉండగా.. కోల్ కతా నైట్  రైడర్స్ వద్ద అత్యల్పంగా రూ.7.05 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2023లో జరగబోయే ఐపీఎల్ కోసం వేలంలో 10 జట్టులు పాల్గొననున్నాయి. మొత్తం 163 మంది ఆటగాళ్లు రిటైన్ కాగా.. 87 స్లాట్స్ వేలానికి అందుబాటులో ఉండనున్నాయి. వివిధ జట్ల వద్ద మొత్తం 206.5 కోట్ల రూపాయలు వేలం కోసం సిద్ధంగా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ 

Advertisement

Manam News

చెన్నై సూపర్ కింగ్స్ జుట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు వద్ద 20.45 కోట్లు ఉన్నాయి. మరో 9 మంది ఆటగాళ్లను తీసుకోనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ 

Manam News

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో విదేశీ ఆటగాళ్లు ఆరుగురు ఉన్నారు. ఇప్పటికే రూ.75.55 కోట్లు ఖర్చు చేయగా.. రూ.19.45 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో 7 మందిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది.

గుజరాత్ టైటాన్స్ 

Manam News

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  రూ.75.75 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.19.25 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో 10  మందిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కోల్ కతా నైట్ రైడర్స్ 

KKR :  Manam News

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 14 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఈ జట్టు అత్యధికంగా 87.95 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా కేవలం రూ. 7.05 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో 10 మందిని తీసుకోనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ 

Advertisement

Manam News

ఇప్పటికే ఈ జట్టు 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.23.35 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో 10 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

Also Read :  బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ కి భారత జట్టు ఇదే.. రిషబ్ పంత్ కి షాకిచ్చిన బీసీసీఐ..!

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 

Manam News పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఇప్పటికే 16 మందిని రిటైన్ చేసుకోగా.. ఇందులో 5 విదేశీ ఆటగాళ్లున్నారు.  ఇప్పటివరకు ఈ జట్టు 62.8 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా 32.2 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో 9 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ 

Manam News

ముంబై ఇండియన్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో 5 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు ఈ జట్టు 74.45 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా రూ.20.55 కోట్లు మిగిలి ఉన్నాయి. 9 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read :   భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆడిన 5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 

manam News

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో 6 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు ఈ జట్టు 86.25 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా రూ.8.75 కోట్లు మిగిలి ఉన్నాయి. మరో 7 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ 

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేయగా.. అందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకు రూ.81.8 కోట్లు ఖర్చు చేయగా..  ఇంకా రూ.13.2 కోట్లు మిగిలి ఉన్నాయి. 9 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ 

Manam News

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకు ఈ జట్టు 52.75 కోట్లు ఖర్చు చేయగా.. అత్యధికంగా ఈ జట్టుకు రూ.42.25 కోట్లు మిగిలి ఉన్నాయి. 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.

Also Read :  ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం పేరు మార్చుకున్న కోహ్లీ

 

Visitors Are Also Reading