Home » ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ చేసిన టాప్ 5 బౌల‌ర్లు వీరే..!

ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ చేసిన టాప్ 5 బౌల‌ర్లు వీరే..!

by Anji
Ad

టీ-20 ఫార్మాట్ అంటే ధ‌నాధ‌న్ షాట్లు.. ఆకాశానికే చిల్లులు ప‌డ‌తాయా అన్న‌ట్టు బ్యాట్స్‌మెన్లు మైదానంలో చెల‌రేగిపోతారు. బౌల‌ర్ల‌కు పీడ‌క‌లను మిగిలుస్తారు. టీ-20ల్లో బౌల‌ర్ల‌పై బ్యాట్స్‌మెన్‌ల డామినేష‌న్ ఆరేంజ్ లో ఉంటుంది. ఎంత‌టి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ అయినా స‌రే త‌న‌ది కాది రోజున దారుణంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవాల్సిందే. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే టాప్ 5 ప‌ర‌మ చెత్త బౌలింగ్ చేసిన బౌల‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జాబితాలో అంద‌రికంటే ముందున్నాడు స‌న్‌రైజ‌ర్స్ మాజీ పేస‌ర్ బాసిల్ థంపి. 2018 ఐపీఎల్ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన థంపి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌రిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌ర‌మ చెత్త ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేశాడు. 2018 మే 17న బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల స్పెల్‌లో అత‌డు 70 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

Advertisement

ఈ జాబితాలో రెండ‌వ స్థానంలో అప్గానిస్తాన్ స్పిన్న‌ర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్. 2019 ఐపీఎల్ సీజ‌న్‌లో ముజీబ్ అప్ప‌టి కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముజీబ్ నాలుగు ఓవ‌ర్ల‌లో ఏకంగా 66 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. తాను వేసిన ఓవ‌ర్‌లో ఏకంగా 26 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో హైద‌రాబాద్ టీమ్ 212 ప‌రుగులు చేసి 45 ప‌రుగుల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది.

Advertisement

మూడ‌వ‌స్థానంలో భార‌త పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో అత‌డు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఇషాంత్ శ‌ర్మ ఏకంగా 66 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసి 223 ప‌రుగులు చేసింది. అనంత‌రం హైద‌రాబాద్ టీమ్ 77 ప‌రుగుల తేడాతో ఓడింది.

2013 ఐపీఎల్ సీజ‌న్‌లో ఉమేశ్ యాద‌వ్ త‌న ఐపీఎల్ లోనే చెత్త బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను చేశాడు. ఆ సీజ‌న్ లో అప్ప‌టి డేర్ డెవిల్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన ఉమేశ్ యాద‌వ్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల‌లో 65 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. తొలి రెండు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన ఉమేశ్‌.. త‌న చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఏకంగా 52 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు 4 ప‌రుగుల తేడాతో గెలిచింది.

ప‌ర‌మ చెత్త బౌల‌ర్ల జాబితాలో సందీప్ శ‌ర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. 2014 ఐపీఎల్ సీజ‌న్‌లో అప్ప‌టి కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన సందీప్ శ‌ర్మ ఈచెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సందీప్ శ‌ర్మ 65 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. మ్యాచ్‌లో ఒక వికెట్ తీసినా ప‌రుగుల ప‌రంగా చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అయినా పంజాబ్ జ‌ట్టు బ్యాట్స్‌మెన్లు ఆ జ‌ట్టును గెలిపించారు.

Also Read :  బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీకి రెండు రోజుల పాటు వ‌ర్ష సూచన

Visitors Are Also Reading