Home » బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీకి రెండు రోజుల పాటు వ‌ర్ష సూచన

బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీకి రెండు రోజుల పాటు వ‌ర్ష సూచన

by Anji
Ad

బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఇది వాయుగుండంగా మార‌నుంద‌ని, అనంత‌రం సోమ‌వారం తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉంద‌ని హెచ్చ‌రించింది. దాదాపు ఉత్త‌ర‌- ఈశాన్య దిశ‌గా క‌దులుతూ మార్చి 22న బంగ్లాదేశ్‌-ఉత్త‌ర మ‌య‌న్మార్ తీరాల‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీని ప్ర‌భావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ద‌క్షిణ దిశ‌గా గాలుల వీస్తున్నాయ‌ని చెప్పారు.

Advertisement


అనంత‌రం మార్చి 21న తుఫాన్‌గా మారే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో తేలిక‌పాటి వ‌ర్ణాలు కురిసే అవ‌కాశ‌ముంది. ఆది, సోమ‌వారాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు లేదా ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్ణాలు కురిసే అవ‌కాశముంద‌ని వెల్ల‌డించారు.

Advertisement

Visitors Are Also Reading