Home » తాలిబొట్టు కూడా కొన‌లేని స్థితిలో పూరీజ‌గ‌న్నాథ్…అలాంటి స్థితిలో పెళ్లి చేసిన న‌టి, యాంక‌ర్ ఎవ‌రంటే..?

తాలిబొట్టు కూడా కొన‌లేని స్థితిలో పూరీజ‌గ‌న్నాథ్…అలాంటి స్థితిలో పెళ్లి చేసిన న‌టి, యాంక‌ర్ ఎవ‌రంటే..?

by AJAY
Published: Last Updated on

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్ట‌ర్ ల‌లో పూరీజ‌గ‌న్నాత్ కూడా ఒక‌రు. పూరీజ‌గ‌న్నాత్ చాలా ఏళ్ల పాటూ హిట్ సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు.

puri-marriage

Puri Jagannadh Marriage

పూరీ చివ‌రి సినిమా లైగ‌ర్ ఫ్లాప్ అయినా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. లైగ‌ర్ త‌ర‌వాత పూరీపై చాలా మంది నెగిటివ్ కామెంట్ లు చేశారు. కానీ అలాంటి వాళ్లు పూరీ తీసిన పోకిరి, బ‌ద్రి, ఇడియ‌ట్ లాంటి సినిమాల‌ను మర్చిపోయి మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే పూరీ ఒక్క‌రోజులోనే స్టార్ అవ్వ‌లేదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్ల‌ను చూశాడు. ప్రేమపెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇంటినుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అప్పుడ‌ప్పుడే సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా పూరీ జేబులో చిల్లిగ‌వ్వ కూడా లేదట‌. దాంతో టాలీవుడ్ లోని ఓ న‌టి మ‌రియు యాంక‌ర్ సాయం చేయ‌డంతో పూరీ పెళ్లి జ‌రిగింది. సాయం చేసిన న‌టి హేమ కాగా యాంక‌ర్ జాన్సీ.

వీరిలో పూరీపెళ్లికి యాంక‌ర్ జాన్సీ తాలిబొట్టును కొనిచ్చార‌ట‌. అంతే కాకుండా హేమ పెళ్లి బ‌ట్ట‌లు పెట్ట‌డంతో పాటూ వ‌చ్చిన ఫ్రెండ్స్ కు కూల్ డ్రింక్స్ కొనివ్వ‌డంతో పాటూ ఇత‌ర ఖ‌ర్చుల‌ను చూసుకున్నార‌ట‌. అలా వీరిద్ద‌రూ పూరీ పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించార‌ట‌. దాంతో ఇప్ప‌టికీ వీరి మ‌ధ్య స్నేహం అలానే ఉంది. హేమ పూరీని త‌న సోద‌రుడు అని చెప్పుకుంటుంది. పూరీజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చాలా సినిమాల‌లో కూడా హేమ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Article Source: Telugu Action

ALSO READ :దారుణంగా మోసపోయిన తారకరత్న… నిర్మాతలు కూడా ముంచేశారు!

Visitors Are Also Reading