Home » ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…?

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…?

by Bunty
Ad

 

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా అద్భుతంగా నటించారు. వారికి కొడుకు పాత్రలో నటించిన అబ్బాయి తన ముద్దు ముద్దు మాటలతో, అల్లరితనంతో ఎంతోమంది అభిమానుల మనసులను సొంతం చేసుకున్నాడు. తలలో మల్లెపూలు పెట్టాలి అని ఒకే ఒక్క చిన్న డైలాగ్ తో తెగ ఫేమస్ అయిపోయాడు.

intlo illalu vantintlo priyuraalu chid

 

ఆ అబ్బాయి పేరు నాగ్ అన్వేష్. ఈ చిన్నోడు అతి చిన్న వయసులోనే సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. నాగ్ అన్వేష్ తల్లి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో అన్వేష్ కి సినిమా అవకాశాలు చాలా సులభంగా వచ్చాయి. అన్వేష్ కూడా చాలా అందంగా హీరోకి సరిపడా క్వాలిటీస్ తో ఉన్నాడు. దీంతో ఇతనికి సినిమాల్లో హీరోగా చాలా అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

నాగ్ అన్వేష్ వినవయ్య రామయ్య అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హెబ్బా పటేల్ తో కలిసి ఏంజెల్ సినిమాలో హీరోగా చేశాడు. ఇక సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలోనే తన స్నేహితురాలు అయినటువంటి కావ్య అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఇక వివాహ అనంతరం తాను సినిమాల్లో ఏ మేరకు నటిస్తాడో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading