Home » ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

by Bunty
Ad

సాధారణంగా పాలు అనేది తెల్లగా ఉంటాయి. కానీ ఆవుపాలు కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి. కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉంటే, కొన్ని కొన్ని జంతువుల పాలు కాస్త వేరే రంగులో కనిపిస్తుంటాయి. ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండకపోవడానికి ప్రత్యేక కారణమే ఉంటుంది. ఆవు పాలలో బీటా కెరోటిన్ అనే పదార్థం కొంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ఆ పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. అదే గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవు పాలు మంచివంటారు. వాటిలో కొవ్వు పదార్ధం తక్కువ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం అవుతుంటాయి.

READ ALSO : మాజీ సీఎం మనవడితో మళ్ళీ దొరికిన జాన్వి కపూర్… వీడియో వైరల్!

Advertisement

వాటిలో బీటా కెరోటిన్ ఏ విటమిన్ గా మార్పుచెంది చిన్నారులకు ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాలను నిష్పత్తి ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో మార్పులు ఉంటాయి. కొవ్వు పదార్థం శాతం ఆవుపాలు, గేదె పాల వలన కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయి. ఆవుపాలతో పోల్చుకుంటే గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కూడా పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలలో మూడు నుండి నాలుగు శాతం కోవ్వు ఉంటే, గేదె పాలలో ఏడు నుండి ఎనిమిది శాతం కొవ్వు ఉంటుంది. దీనితో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.

Advertisement

READ ALSO : నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

Cow Milk vs Buffalo Milk for Babies & Toddlers: What to Feed?

అంతేకాకుండా ఆవుపాలలో 90% నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కు గురికాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కానీ గేదె పాలలో అలా కుదరదు. పాలలో ప్రోటీన్స్, ఇక ప్రోటీన్ల విషయానికొస్తే ఆవుపాలతో పోలిస్తే గేదె పాలలు 10 శాతం కు పైగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల గేదె పాలు పెద్దలకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. రెండు పాలల్లో కెలరీల శాతం, ఈ రెండు పాలల్లో ఉండే కేలరీల శాతం చూస్తే, గేదె పాలలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు పదార్థం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Visitors Are Also Reading