Home » ఒక్కరు నో చెప్పినా సినిమాకు మరొకరు ఓకే చెప్పుకొని ఇద్దరు హిట్ కొట్టారు.. వారెవరో మీకు తెలుసా..?

ఒక్కరు నో చెప్పినా సినిమాకు మరొకరు ఓకే చెప్పుకొని ఇద్దరు హిట్ కొట్టారు.. వారెవరో మీకు తెలుసా..?

by Azhar
Ad
సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో వద్దు అనుకున్న సినిమాను మరి హీరో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఓ హీరోయిన్ వదులుకున్న కథను మరో హీరోయిన్ ఓకే చేసి స్టార్ హీరోయిన్ గా మరిక తలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెబ్బబోయే విధంగా మాత్రం చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే జరిగి ఉంటుంది. అదేంటంటే మొదటి హీరోయిన్ నో చెప్పిన కథను రెండు హీరోయిన్ ఓకే చెప్పగా… ఆ రెండో హీరోయిన్ వద్దనుకున్నా సినిమాను ఈ మొదటి హీరోయిన్ చేసి సూపర్ హిట్ కొట్టారు. అయితే ఆ సినిమాలు ఏంటి.. హీరోయిన్స్ ఎసరు అనేది మీకు తెలుసా…!
మహేష్ బాబును స్టార్ హీరో చేసిన సినిమా ఏంటంటే ఒక్కడు అనే చెప్పాలి. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు నిర్మించారు. ఇక ఇందులో హీరోయిన్ గా భూమిక నటించింది. అలాగే ఉదయ్ కిరణ్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలో ఒక్కటిగా నిలిచినా సినిమా మనసంతా నువ్వే. ఇందులో హీరోయిన్ గా రీమాసేన్ నటించగా..  వీ.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఎం.ఎస్.రాజునే ఈ సినిమాను కూడా నిర్మించారు. అయితే ఈ రెండు సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన ఓ విషయాన్ని తాజాగా నిర్మాత ఎం.ఎస్.రాజు తెలియజేసారు.
అదేంటంటే.. ఈ రెండు సినిమాలు తన దగ్గుకు ఒక్కేసారి వచ్చాయని… దాంతో ఈ రెండు కథలను ఒక్కేసారి అప్పటి స్టార్ హీరోయిన్స్ అయిన భూమిక, రీమాసేన్ లకు వినిపించమని ఆయన చెప్పారు. కానీ ఇందులో భూమికకు కేవలం ఒక్కడు కథ మాత్రమే నచ్చాగా.. రీమాసేన్ కు మనసంతా నువ్వే స్టోరీ నచ్చిందని ఆయన పేర్కొన్నాడు. దాంతో వారికీ వచ్చిన కథతోనే ఆ సినిమానాలు తెరకెక్కించినట్లు ఎం.ఎస్.రాజు తెలిపారు. అయితే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఒక్కడు సినిమాను  రీమాసేన్, మనసంతా నువ్వే ను భూమిక వదులుకున్నట్లు అయ్యింది.

Advertisement

Visitors Are Also Reading