Home » రాహుల్ తెవాటియా విషయంలో బీసీసీఐ తప్పు చేస్తుందా…?

రాహుల్ తెవాటియా విషయంలో బీసీసీఐ తప్పు చేస్తుందా…?

by Azhar
Ad

ఐపీఎల్ ద్వారా చాలా మంది క్రికెటర్లలు అనేవారు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఎవరిని టీమ్ ఇండియాకు ఎంపిక చేయాలి ఎవరిని చేయకూడదు అనే విషయంలో పెద్ద చర్చే జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక అలాంటి ఓ చర్చలోనే భారత ఆటగాడు రాహుల్ తెవాటియా విషయంలో బీసీసీఐ తప్పు చేసిందా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్లు ఎక్కువ కావడంతో బీసీసీఐ రెండు జట్లను తాయారు చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా ఇంన్క జట్టులోకి రావాల్సిన ఆటగాళ్లు మిగిలే ఉన్నారు అని చెప్పాలి.

Advertisement

ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెవాటియా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టి తన జట్టుకు విజయం అందించిన తెవాటియా… ఆ తర్వాత కూడా చాలా మ్యాచ్ లలో గుజరాత్ కు ఫినిషర్ రోల్ పోషించి జట్టు విజయాలలో కీలకంగా నిలిచాడు. అయిన కూడా ఐర్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన రెండో జట్టులో తెవాటియాకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.

Advertisement

దాంతో ఈ విషయం పై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ఐర్లాండ్ కు వెళ్తున్న భారత జట్టులో తెవాటియా కు చోటు కల్పించాలింది అని అన్నాడు. ఇప్పుడు ఆ పర్యటనకు 17 మందిని ఎంపిక చేసారు. అయితే తుది జట్టులో చోటు కల్పించకపోయిన కనీసం 18వ ఆటగాడిగానైనా సరే తెవాటియాను ఈ పర్యటనకు పంపాల్సింది. అలా చేయడం వల్ల సెలక్టర్లు తనను గుర్తించారు అనే సంతృప్తి అతనికి కలుగుతుంది. అదే అతనిలో ఓ కొత్త ఉత్సాహాన్ని తీసుకవస్తుంది అని గవాస్కర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నరకం చూస్తున్న ఆటగాళ్లు..!

భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

Visitors Are Also Reading