Home » ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిని విప్రో ప్రేమజీ రిజెక్ట్ చేసారని తెలుసా?ఒకవేళ చేయకుంటే?

ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిని విప్రో ప్రేమజీ రిజెక్ట్ చేసారని తెలుసా?ఒకవేళ చేయకుంటే?

by Srilakshmi Bharathi
Ad

విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తన కంపెనీలో సెలెక్షన్స్ విషయంలో పొరపాటు చేయకుండా ఉండి ఉంటె అసలు ఇన్ఫోసిస్ కంపెనీనే ఉండేది కాదు. ఈ విషయాన్ని నారాయణ మూర్తి ఇటీవల CNBC-TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఐటి పరిశ్రమలో విప్రో యొక్క అగ్ర ప్రత్యర్థులలో ఒకటైన ఇన్ఫోసిస్ స్థాపించడానికి ప్రధాన కారణం విప్రో సంస్థ తనను తిరస్కరించడమేనని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. తనను విప్రో నియమించి ఉంటే, పరిస్థితులు భిన్నంగా ఉండేవని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Advertisement

జనవరి 12 నాటికి, ఇన్ఫోసిస్ విలువ ₹6.65 లక్షల కోట్లు మరియు విప్రో ₹2.43 లక్షల కోట్లుగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇన్ఫోసిస్ సంస్థ విప్రో సంస్థకి గట్టి పోటీనే ఇస్తోంది. ఇన్ఫోసిస్ స్థాపించక ముందు నారాయణ మూర్తి గారు IIM అహ్మదాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్, అక్కడ అతను చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు.

Advertisement

ఆయన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం బేసిక్ ఇంటర్‌ప్రెటర్, కంప్యూటర్‌ను నిర్మించడంలో పాలుపంచుకున్నారు. ఇన్ఫోసిస్ కంటే ముందే మూర్తి సాఫ్ట్‌ట్రానిక్స్‌ని స్థాపించారు, కానీ అది విఫలమైంది. ఆ తర్వాత పూణేలోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో చేరారు. విప్రో సంస్థ కూడా ఆయన అప్లికేషన్ ను తిరస్కరించడంతోనే ఆయన సొంతంగా కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని విప్రో అధినేత ప్రేమ్ జి కూడా ఒప్పుకున్నారు. ఆరోజు నారాయణ మూర్తిని విప్రో లోకి తీసుకుని ఉంటె.. ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ స్టోరీలు మరోలా ఉండేవి అని అన్నారు.

Visitors Are Also Reading