Home » అదుర్స్ అనిపించిన అవేశ్‌ఖాన్‌.. నాలుగో టీ-20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం

అదుర్స్ అనిపించిన అవేశ్‌ఖాన్‌.. నాలుగో టీ-20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం

by Anji
Ad

ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు టీ-20 మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇక శుక్ర‌వారం రోజు జ‌రిగిన నాలుగ‌వ మ్యాచ్‌లో భార‌త్ 82 ప‌రుగుల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. మూడవ టీ-20 మ్యాచ్ గెలిచిన భార‌త్ నాలుగ‌వ టీ-20లోనూ ఘ‌న విజ‌యాన్ని సాధించి 2-2 తో సిరీస్‌ను స‌మానం చేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు సాధించింది.

Advertisement

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ దినేష్ కార్తీక్ 27 బంతుల్లో 55 ప‌రుగులు సాధించాడు. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో దూకుడుగా ఆడిన కార్తీక్ అర్ధ‌సెంచ‌రీ సాధించాడు. హార్దిక్ పాండ్యా 31 బంతుల్లో 46 ప‌రుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో రాణించాడు. ద‌క్షిణాఫ్రికా 16.5 ఓవ‌ర్ల‌లో 87 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అవేశ్‌ఖాన్ (4/18)తో ముఖ్య‌మైన వికెట్ల‌తో ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీయ‌గా.. చాహ‌ల్‌కు 2 వికెట్లు ద‌క్కాయి. యువ‌ఫేస‌ర్ అవేశ్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో స‌ఫారీల‌ను క‌కావిక‌లం చేసారు. అవేష్‌ఖాన్ 18 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 170 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా 16.5 ఓవ‌ర్ల‌కు ఒక్క‌సారిగా 87 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిపోయింది. అవేశ్‌తో పాటు చాహ‌ల్ 2 వికెట్లు, హ‌ర్ష‌ల్ ప‌టేల్ 1, అక్ష‌ర్ ప‌టేల్ 1 వికెట్ తీసి క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో సున‌యాసంగా భార‌త జ‌ట్టు విజ‌య తీరాల‌కు చేరుకుంది.

Advertisement


ద‌క్షిణాఫ్రికా ఛేద‌న‌లో పూర్తిగా త‌డ‌బ‌డింది. ఏ ద‌శ‌లో కూడా ఆ జ‌ట్టుకు మ్యాచ్ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. గాయంతో బ‌పుమా (8) (రిటైర్డ్ హార్ట్‌) త‌ప్పుకోగా.. డికాక్ (14) ఊహించ‌ని రీతిలో ర‌నౌట్ అయ్యాడు. ప్రిటోరియ‌స్‌(0) విఫ‌లం అవ్వ‌డంతో.. ఈ సిరీస్‌లో స‌ఫారీ టీమ్‌కు బ‌లంగా నిలిచిన ముగ్గురు బ్యాట‌ర్లు క్లాసెన్ (8) మిల్ల‌ర్ (9) వాన్ డ‌ర్ డ‌సెన్ (20)త‌క్కువ వ్య‌వ‌ధిలో ఔట్ కావ‌డంతో 14 ఓవ‌ర్ల‌లోనే ఆ జ‌ట్టు గెలుపు ఆశ‌లు దాదాపు కోల్పోయింది. అవేశ్ ఒకే ఓవ‌ర్‌లో 3 వికెట్లు విశేషం. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన వారిలో ఎవ్వ‌రూ కూడా అంత‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో స‌ఫారీ జ‌ట్టు ఓట‌మి ఖాయం అయింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-2తో స‌మ‌వ‌జ్జీగా నిలిచింది. నిర్ణ‌య‌క ఐద‌వ టీ20 మ్యాచ్ ఈనెల 19న బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలిస్తే వారు సిరీస్ కైవ‌సం చేసుకుంటారు.

Also Read : 

వ‌న్డేల్లో ఇంగ్లండ్ విధ్వంసం.. 498 ప‌రుగులతో ప్ర‌పంచ రికార్డు..!

 

Visitors Are Also Reading