Home » వ‌న్డేల్లో ఇంగ్లండ్ విధ్వంసం.. 498 ప‌రుగులతో ప్ర‌పంచ రికార్డు..!

వ‌న్డేల్లో ఇంగ్లండ్ విధ్వంసం.. 498 ప‌రుగులతో ప్ర‌పంచ రికార్డు..!

by Anji
Ad

విధ్వంస‌క‌ర ఆట‌తో ఇదివ‌ర‌కు ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన ఇంగ్లాండ్‌ తాజాగా మ‌రొక రికార్డును సృష్టించింది. వ‌న్డే చ‌రిత్ర‌లోనే ఇంగ్లాండ్ స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. ఇక వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు న‌మోదు చేసింది ఇంగ్లాండ్ జ‌ట్టు. ఆమ్‌స్టెల్‌వీన్ వేదిక‌గా నెద‌ర్లాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ జ‌ట్టు కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 498 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఆ త‌రువాత క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరిట ఉన్న అత్య‌ధిక స్కోర్ రికార్డును ఇంగ్లాండ్ అధిగ‌మించింది. అంత‌కుముందు 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 481 ప‌రుగులు చేసింది.


ఇక మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా నెద‌ర్లాండ్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెన‌ర్ జాస‌న్ రాయ్ (1) పెవిలియ‌న్ చేరాడు. ఆ ఒక్క విష‌య‌మే నెద‌ర్లాండ్‌కు ఊర‌టనిచ్చే అంశం. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన ఆట‌గాళ్లంద‌రూ దూకుడుగానే ఆడారు. ఫిలిప్ సాల్ట్ (122), డేవిడ్ మ‌లాన్ (125)తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. మ‌ల‌న్‌, సాల్ట్ రెండ‌వ వికెట్‌కు 170 బంతుల్లో 222 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేసారు. సాల్ట్ ఔట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన బ‌ట్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయి సిక్స‌ర్లు, ఫోర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాఉ. ఈ త‌రుణంలో కేవ‌లం 47 బంతుల్లోనే బ‌ట్ల‌ర్ సెంచ‌రీ సాదించ‌డం విశేషం.

Advertisement

Advertisement

బ‌ట్ల‌ర్ ఈ మ్యాచ్‌లో 70 బంతుల్లో 162 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 14 సిక్సులున్నాయి. అదేవిధంగా చివ‌రిలో లివింగ్ స్టోన్ 22 బంతుల్లో 66 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కేవ‌లం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లోనే 26 సిక్స్‌లు, 36 బౌండ‌రీలు న‌మోద‌య్యాయి. ఈ మ్యాచ్‌లో 70 బంతులలో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు నమోదు కావ‌డం విశేషం. దీంతో ఓ ద‌శ‌లో జ‌ట్టు స్కోర్ 500 ప‌రుగులు దాటేవిధంగా క‌నిపించింది. చివ‌రికి 500ల‌కు కేవ‌లం 2 ప‌రుగుల దూరంతో నిలిచిపోయింది.

వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన అత్య‌ధిక స్కోర్లు

498/4 నెద‌ర్లాండ్ పై ఇంగ్లాండ్

481/6 ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్

443/3 పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్

443/9 నెద‌ర్లాండ్ పై శ్రీ‌లంక

439/2 వెస్టిండిస్ పై ద‌క్షిణాఫ్రికా

438/9 ఆస్ట్రేలియాపై ద‌క్షిణాఫ్రికా

438/4 భార‌త్ పై ద‌క్షిణాఫ్రికా

434/4 ద‌క్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా

418/5 జింబాబ్వేపై ద‌క్షిణాప్రికా

418/5 వెస్టిండిస్‌పై భార‌త్

 

Visitors Are Also Reading