Home » పాకిస్థాన్ పై గెలిస్తే ప్రపంచ కప్ గెలిచినట్టే..!

పాకిస్థాన్ పై గెలిస్తే ప్రపంచ కప్ గెలిచినట్టే..!

by Azhar
Ad
గత ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో మొదటి మ్యాచ్ పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఓడిపోయిన భారత జట్టు.. సెమీస్ కు కూడా చేరుకోకుండానే ఇంటికి వచ్చేసింది. అయితే ఈ నెలలో 23న మళ్ళీ ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ తో తలపడబోతుంది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తో గెలిస్తే ఇండియా ప్రపంచ కప్ గెలిచినట్లే అని కామెంట్స్ చేస్తున్నాడు మాజీ ఆటగాడు సురేశా రైనా.
అయితే తాజాగా రైనా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత జట్టుకు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. బుమ్రా, జడేజా లేకపోవడంతో భారత జట్టు కొంత బలహీనంగా తయారైంది. కానీ వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ పై గెలిచి మళ్ళీ తమ సత్తా అనేది నిరూపించుకుంది భారత జట్టు. అయిన కూడా ఇండియా జట్టులోని ఆటగాళ్లలో ఉత్సహం అనేది లేదు.
కానీ ఈ టోర్నీని మనం దాయాధి పాకిస్థాన్ తో ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఈ మ్యాచ్ లో మనం పాక్ పై విజయం సాధించాలి. అంతే ఆ గెలుపుతే ఆటగాళ్లలో ఉత్సహం అనేది వస్తుంది. ఫ్యాన్స్ కూడా రెండింతలు జట్టుకు సపోయేట్ చేస్తారు. అది చాలు.. మన జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లి టైటిల్ అందించడానికి అని రైనా పేర్కొన్నాడు. ఒకవేళ పాక్ చేతిలో ఓడిపోతే ఏం జరుగుతుందో మనం గత ఏడాది టోర్నీలోనే చూసాము.

Advertisement

Visitors Are Also Reading