Home » ఇండియా పాకిస్థాన్ రాకపోతే అదే జరుగుతుంది..!

ఇండియా పాకిస్థాన్ రాకపోతే అదే జరుగుతుంది..!

by Azhar
Ad

భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో పాల్గొనదు. మా జట్టు పాకిస్థాన్ వెళ్లదు. ఈ టోర్నీ తటస్థ వేదికగా జరుగుతుంది అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు జై షా చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారాయి అనేది తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ పెద్ద లేఖనే విడుదల చేసింది.

Advertisement

అందులో పాక్ బోర్డు.. జై షా చేసిన వ్యాఖ్యలు మమల్ని నిరాశ పరిచాయి. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఒక్క దేశం తాపమున మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ఏసీసీ మీటింగ్ లో 2023 ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కు వచ్చాయి. కానీ ఇప్పుడు పాక్ బోర్డును గాని.. మేనేజ్మెంట్ ను గాని సంప్రదించకుండా ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం మంచింది కాదు. ఇది ఏసీసీ పద్ధతులకు విరుద్ధం.

Advertisement

పాకిస్థాన్ లోకి భారత జట్టు రాకపోతే దీని ప్రభావం అనేది వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వాడే ప్రపంచ కప్ తో పాటుగా.. 2031 వరకు డిసైడ్ అయిన టోర్నీల సైకిల్ పైన మొత్తం ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంపైన చర్చించడానికి ఏసీసీ వెంటనే ఓ ఎమర్జెన్సీ మీటింగ్ అనేది పెట్టాలి అని పాక్ బోర్డు పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ మొదటి నిర్ణయం..!

పాకిస్థాన్ పై గెలిస్తే ప్రపంచ కప్ గెలిచినట్టే..!

Visitors Are Also Reading