Home » ఉత్కంఠ బరితంగా సాగిన రెండో టెస్ట్ లో టీమిండియా గెలుపు..ప్రపంచ రికార్డు నమోదు..!

ఉత్కంఠ బరితంగా సాగిన రెండో టెస్ట్ లో టీమిండియా గెలుపు..ప్రపంచ రికార్డు నమోదు..!

by Anji
Ad

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్  ఉత్కంఠభరితంగా సాగింది.  ఈ మ్యాచ్ లో  టీమిండియా  మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 145 పరుగుల లక్ష ఛేదనలో భారతజట్టు 74 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. దాదాపు గెలుపు కష్టమనే అందరూ భావించారు. కష్టాల్లో ఉన్న జట్టును రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 71 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Advertisement

ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఎనిమిదో వికెట్ కి 71 పరుగులు జోడించిన అశ్విన్, అయ్యర్ లు భారత జట్టు తరపున ఒక టెస్ట్ లో నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో లాలా అమర్ సింగ్-లాల్ సింగ్ జోడి ఉంది. 1932లో ఇంగ్లండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ జోడీ ఎనిమిదో స్థానంలో 74 పరుగులు జోడించారు. రికార్డు పరంగా భారతజట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. మూడో స్థానంలో కపిల్ దేవ్-లక్ష్మన్ శివరామకృష్ణన్ జోడి ఉన్నది. 1985లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో ఈ జోడి 8వ వికెట్ కి 70 పరుగులు జోడించారు.

Advertisement

Also Read :  సంక్రాంతి పండుగకి వచ్చే సినిమాల్లో విన్నర్ గా నిలిచేది ఆ సినిమానేనా..? 

ప్రధానంగా ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరవాత బ్యాటింగ్ చేసిన భారతజట్టు తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 231కి ఆలౌట్ కావడంతో టీమిండియా లక్ష్యం  145 పరుగులు. టాప్ ఆర్డర్ విఫలం చెందడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 45 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. నాలుగో రోజు త్వరగా వికెట్లను కోల్పోయింది. అయితే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్ పోకుండా నిలకడగా ఆడి బంగ్లాదేశ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు తీసుకొచ్చారు. ముఖ్యంగా అశ్విన్ 42 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్ కి ప్లేయర్ ఆఫ్ ద పురస్కారం లభించింది. అదేవిధంగా ఈ సిరీస్ లో రాణించినటువంటి ఛటేశ్వర్ పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. 

Also Read :   IPL Auction 2023 : అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

Visitors Are Also Reading