Home » జీవితంలో అలా జరగాలని కోరుకుంటే ఒత్తిడి తప్పదు.. నిహారిక పోస్ట్ వైరల్..!

జీవితంలో అలా జరగాలని కోరుకుంటే ఒత్తిడి తప్పదు.. నిహారిక పోస్ట్ వైరల్..!

by Anji
Ad

మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యాక్టింగ్ మాత్రమే కాకుండా యాంకరింగ్ లోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు.

Advertisement

ఈ బ్యానర్ పై పలు సినిమాలను నిర్మించి హిట్స్ అందుకున్నారు. చాలా రోజులుగా నటనకు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్ లో నటించి అలరించారు. కొద్ది రోజుల కిందట తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంటున్నట్టు జూలై 04న ప్రకటన చేసింది. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని కోరింది. అయినప్పటికీ నిహారిక పై మాత్రం నెగిటివీ తగ్గలేదు. నిహారిక మాత్రం అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది నిహారిక.

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “జీవితంలో కొన్ని వలయాలుంటాయి. ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఒకే చోట ఆగిపోవాలని మనం కోరుకుంటే వాని సహజ గుణానికి అడ్డుపడుతున్నట్టే. దీంతో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.జీవితం ఎటు తీసుకెళ్తే.. అటు వెళ్లండి. ఈ జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్న తరువాత మనం సర్ ప్రైజ్ అవుతాం” అంటూ షేర్ చేసింది నిహారిక. అదేవిధంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Sai Dharam Tej: “మీ ప్రేమ భయం కలిగిస్తోంది..” అంటూ అభిమానులకు ఓపెన్ లెటర్ రాసిన సాయి ధరమ్ తేజ్!

 ప్రపంచంలోనే బాలయ్య ఓ అరుదైన రికార్డు సాధించాడనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading