Home » ప్రపంచంలోనే బాలయ్య ఓ అరుదైన రికార్డు సాధించాడనే విషయం మీకు తెలుసా ?

ప్రపంచంలోనే బాలయ్య ఓ అరుదైన రికార్డు సాధించాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకి ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం బాలయ్యకి క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలయ్య భోళా మనిషి అని.. అందరితో సరదాగా ఉంటారని ఎవ్వరికీ ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారు. ప్రపంచంలో బాలయ్యకి మాత్రమే సొంతం అయిన అరుదైన రికార్డు ఉంది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం పలు సినిమాలకు సంబంధించి జరిగింది. 

Advertisement

బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సైతం ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. ప్రపంచంలో బాలయ్యకి మాత్రమే సాధ్యం అయిన ఈ అరుదైన రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. బాలయ్య తన సినిమాల ఫలితాల గురించి.. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోరు. చరిత్ర సృష్టించినా చరిత్ర తిరగరాసినా ఆ ఘనతల గురించి ప్రస్తావించడానికి బాలయ్య పెద్దగా ఇష్టపడరు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతల మేలు కోరే అతికొద్ది మంది హీరోల్లో బాలయ్య ఒకరు. నిర్మాతల డబ్బులను వృధా చేయడానికి బాలయ్య అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. స్టార్ హీరో బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా.. అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. బాలయ్య మూవీ విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. బాలయ్య సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య  ఊహించని స్థాయిలో పెరుగుతోంది. బాలయ్య పారితోషకం భవిష్యత్ ప్రాజెక్ట్ లకు రూ.30కోట్ల రేంజ్ లో ఉండనుందని సమాచారమందుతోంది. బాలయ్య సినిమాలను తీయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలయ్యలోని ఆ యాంగిల్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చూపిస్తాడా ?

పవర్ స్టార్ ట్రెండ్ సెట్టర్.. ఏ హీరోకి సాధ్యం కాలేదు..!

 

Visitors Are Also Reading