Home » ప్ర‌భాస్ రాబోయే సినిమాల గురించి వేణు స్వామి ఏమ‌న్నారంటే..?

ప్ర‌భాస్ రాబోయే సినిమాల గురించి వేణు స్వామి ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

భార‌త బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోల‌లో ప్ర‌భాస్ ఒక‌రు. బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని విధంగా ప్రభాస్ సినిమాలో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కెరీర్ స్వరూపమే మారిపోయింది. ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజీ రావడంతో నిర్మాతలు అతడి కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ప్రభాస్ వెంట పడుతున్నాయి.

Also Read :  ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్ట‌మైన సినిమా ఆ స్టార్ హీరోదే..!

Advertisement

ఇది ఇలా ఉండగా.. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అయింది. దీంతో టాలీవుడ్ హీరోల జాతకాలు మరొకసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో పలువురు జ్యోతిష్యులు ప్రభాస్ జాతకాన్ని నిర్వహింస‌ వారికి తోచిన విధంగా చెబుతున్నారు. ముఖ్యంగా వేణు స్వామి వివాదాస్పద ప్రిడిక్షన్ తో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత విడి పోతారని కూడా స్వామి గతంలో తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి చెప్పారు.

Advertisement

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడారు. ప్రభాస్ తో సినిమాలు నిర్మించాలనుకునే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభాస్ నటించబోయే సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా మారబోతున్నాయి. నిర్మాతలు చాలా నష్టపోతారని వేణు స్వామి పేర్కొన్నారు. దీంతో వేణు స్వామి పై ప్రభాస్ అభిమానులు త్రోలింగ్ షురూ చేశారు. వేణు స్వామి చెప్పిన జాతకం నమ్మాల్సిన అవసరం లేదని.. పైన చెప్పిన జాతకాలు అన్నీ కచ్చితంగా జరగలేదని పేర్కొన్నారు. కేవలం పబ్లిసిటీ, అటెన్షన్ అటెన్షన్ కోసం వేణు స్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్ర‌స్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్, ప్రాజెక్టు కే వంటి సినిమాలో న‌టిస్తున్నాడు. అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావ‌డం విశేషం.

Also Read :  హీరోయిన్ భానుప్రియ డైరెక్ట‌ర్ వంశీ ప్రేమ‌క‌థ ఇదే..!

Visitors Are Also Reading