Telugu News » Blog » హీరోయిన్ భానుప్రియ డైరెక్ట‌ర్ వంశీ ప్రేమ‌క‌థ ఇదే..!

హీరోయిన్ భానుప్రియ డైరెక్ట‌ర్ వంశీ ప్రేమ‌క‌థ ఇదే..!

by AJAY
Ads

డైరెక్టర్ వంశీ పేరు చెబితేనే మనకు గోదారి పల్లెలు, గోదావరి తీరాలు ఎన్నో మరపురాని మధురానుభూతులు గుర్తుకు వస్తాయి. వంశీ సినిమాలు అన్ని పల్లెల నేపథ్యంలోనే కొనసాగుతాయి. ఆయన కథల్లో స్వచ్ఛమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. వైవిధ్యమైన సినిమాలకు వంశీ పెట్టింది పేరు. వంశీ సినిమాల్లో హీరోయిన్ లను చాలా బాగా చూపిస్తారు. అచ్చ తెలుగు ఆడపడుచు వంశీ హీరోయిన్లు ఉంటారు. ఇక వంశీ-భానుప్రియకు మధ్య ఏదైనా ప్రేమ కథ ఉందా? అంటే ఈ తరం జనరేషన్ లో చాలా మందికి తెలియదు.

Also Read :  త‌ల్లి షాలిని కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ అమ్మ అని పిలిచే మ‌హిళ ఎవ‌రో తెలుసా..?

ప్రముఖ కెమెరామెన్ ఒకరు అయినా ఎంవీ రఘు తాజా ఇంట‌ర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను, వంశీ కలిసి విశ్వనాథ్ గారితో పని చేశామని.. విజయ బాపినీడు డైరెక్టర్ చేసిన మగమహారాజు ఈ సినిమాతో తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం అని రఘు తెలిపారు. అప్పట్లో వంశీకి, తనకు విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగేదని.. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని.. తమ ఇద్దరి మధ్య కొన్ని చర్చలు అయితే జరిగేవని రఘు చెప్పారు. మేకప్ ఎక్కువగా బ్రైట్ గా వస్తే తమ ఇద్దరి మధ్య వాదోపవాదాలు నడిచేవి అని చెప్పారు రఘు.

ఓ సినిమాలో హీరోయిన్ భానుప్రియ కు మేకప్ ఎక్కువ అవ్వడం తో తాను ఈ విషయాన్ని అందరి ముందు చెప్పడంతో వంశీ ఫీల్ అయ్యాడని.. ఆ తర్వాత భానుప్రియ కూడా హర్ట్ అయ్యిందట. ఈ విషయాన్ని వంశీ తనతో చెప్పాడని.. అయితే ఆ సమయంలో తాను మాత్రం తప్పు చేయలేదని.. తనది తప్పుకాదని.. తాను మాత్రం సారీ చెప్పలేనని.. అవసరమైతే సినిమా మానేస్తానని వంశీతో అన్నానని రఘు అన్నారు. వంశీ – భానుప్రియ గురించి వచ్చిన గ్రాఫిక్స్ పై కూడా రఘు స్పందించాడు. ముందు భానుప్రియ అతడు ఇష్టపడటం మొదలు పెట్టాడ‌ని.. ఇక కెరీర్ ఇచ్చాడు కాబట్టే ఆమె కూడా కో ఆపరేట్ చేసిందని రఘు సంచలన విషయాలు చెప్పాడు. అయితే వారిద్దరి మధ్య వచ్చిన వార్తలో కొన్ని నిజాలు ఉంటే.. మరికొన్ని గాసిప్స్‌ కూడా ఉన్నాయని రఘు చెప్పాడు.

Also Read : VIDEO : నిహారిక ప‌బ్ ఇష్యూపై నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!


You may also like