Home » తమిళంలో కమల్.. తెలుగులో చంద్రమోహన్..! ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

తమిళంలో కమల్.. తెలుగులో చంద్రమోహన్..! ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

by Anji
Ad

రాజమండ్రికి 30 కిలోమీట్ల దూరంలో ఉన్న గోకవరంకి చెందిన మిద్దె రామారావు కి ఎప్పటికైనా సినిమా తీయాలనేది ఒక కోరిక ఉండేది. మద్రాస్ కి వెళ్లి తొలుత జెమినీ గణేషన్ నటించిన మలాయి నట్టు మంగాయి (Malai Nattu Mangai)  అనే తమిళ సినిమా హక్కులను తీసుకొని కొండవీటి వీరుడు అనే పేరుతో అనుమతి ఇచ్చారు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే ఈసారి స్ట్రెయిట్ సినిమా చేయాలనుకున్నాడు. మంచి రీమేక్ కోసం అన్వేషణలో పడ్డాడు. తమిళంలో అప్పుడే భారతీ రాజా పదహారు వయత్తినేలే అనే సినిమా తీశారు.

Advertisement

మొదటి భారతీరాజా విలియం ఫైనాన్స్ కార్పొరేషన్ కి స్క్రిప్ట్ పంపిస్తే వారు తిరస్కరించారు. అప్పుడే ఆయనకు ఎస్.ఈ.రాజు కన్ను అనే లారీ ఓనర్  పరిచయం అయ్యాడు. ఆయనకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. నాలుగున్నర లక్షల్లో సినిమా అయిపోతుందని భారతీ రాజా చెప్పడంతో ఆయన సినిమా తీశారు. కానీ బడ్జెట్ రూ.6లక్షలు అయింది. మిగిలిన లక్షన్నర కోసం లారీని అమ్ముకొని మరీ సినిమా తీశాడు. తొలి నాలుగు వారాలు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఐదో వారం నుంచి ఈ సినిమా ఊపు అందుకుంది. 100 ప్రింట్లు తీసినా సరిపోలేదు. ఈ సినిమాలో పదహారేళ్ల కన్నెపిల్లలా శ్రీదేవి నటించింది. భారతీరాజా మంచి హీరోయిన్ ను ఎంచుకున్నారని అందరూ ప్రశంసించారు.

అమాయకుడిగా కమల్ హాసన్, పోకిరి పాత్రలో రజినీకాంత్ నటించారు. సినిమా పూర్తిచేయడం కోసం లారీ అమ్ముకున్న రాజు అనూహ్యమైన మలుపు తిరిగింది. సినిమా 50 రోజులు పూర్తి చేసే సరికి ఇన్ కమ్ టాక్స్ దాడుల నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వచ్చారు. ఈ సినిమా రైట్స్ కోసం అగ్రనిర్మాతలు అన్ని భాషల నుంచి ప్రయత్నించారు. కానీ నిర్మాత రాజు కన్ను ఆచూకి ఎవ్వరికీ లభించలేదు. ఈయన దేవకి హాస్పిటల్ లో ఆశ్రయం పొందారని ఓ మేనేజర్ ద్వారా తెలుసుకొని మిద్దె రామారావు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని వెళ్లారు. సరిగ్గా అదే సమయానికి భారతీరాజా కూడా అక్కడే ఉన్నారు. మిద్దె రామారావు ఈ సినిమా కోసం ఒక ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశారట. భారతీరాజా నిర్మాతను ఒప్పించారు. మిద్దెరామారావు ఈ సినిమా కాపీ రైట్స్ ను రూ.1,25,000కి కొన్నారు. ఆ రోజుల్లో రీమేక్ కి రూ.50వేలు అయితే ఆడికే మా ఎక్కువ. చాలా మంది ప్రయత్నించినా దొరకని హక్కులు కొత్త నిర్మాతకు దొరకడంతో తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.  తన అభిరుచికి తగిన కథ కావడంతో మిద్దె రామారావు అడగ్గానే రాఘవేంద్రరావు ఒప్పుకున్నారు. పదహారేళ్ల వయస్సు అనే టైటిల్ నిర్ణయించారు. సంగీత దర్శకుడిగా చక్రవర్తిని తీసుకున్నారు. 

Advertisement

కుంటివాడు గోపాల  కృష్ణ పాత్రను చేయడానికి శోభన్ బాబు ఆసక్తి చూపించారు. కానీ అంత గ్లామరస్ హీరో గోచి పెడితే బాగోదని.. చంద్రమోహన్ ని తీసుకున్నారు. సింహాచలం పాత్రను రజినీకాంత్ కాంత్ చేయాలనుకున్నారు. కానీ మోహన్ బాబుకి ప్రాధాన్యత ఇచ్చారు. మళ్లీ పాత్రకు జయప్రద చేస్తానని చెప్పారు. అయితే తమిళంలో నటించిన శ్రీదేవినే తీసుకున్నారు. అప్పటికీ ఆమెకు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. తెలుగులో అంతగా గుర్తింపు లేదు. కే.రాఘవేంద్ర రావు ఒకపక్క సింగబలం చేస్తూ.. మరోవైపు ఈ సినిమా చేశారు. 1978 మార్చి 28 నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తిరుపతి ప్రాంతంలో షూటింగ్ చేశారు. సిరిమల్లె పువ్వు పాటను చంద్రగిరి సమీపంలోని పల్లెటూరులో చిత్రీకరించారు. 35 రోజుల్లో సినిమా పూర్తయింది.  శ్రీదేవికి 30,000, చంద్రమోహన్ కి 12,500, మోహన్ బాబుకి 10,000 పారితోషికంగా ఇచ్చారు. రీమేక్ కి ఇచ్చిన లక్ష పాతికవేలతో కలిపి మొత్తం రూ.10లక్షలు ఖర్చు అయింది. అయితే 1978 ఆగస్టు 31న పదహారేళ్ళ వయసు చిత్రం విడుదలైంది. అందరూ ఊహించినదానికంటే రెట్టింపు ఫలితం వచ్చింది. కొత్త కథ కావడంతో అప్పట్లో  ప్రజలు పదహారేళ్ల వయస్సు మూవీని అద్భుతంగా ఆదరించారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!   తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading