Home » చలికాలంలో కాకర తింటే ఆ రోగాలు దరి చేరవు..!

చలికాలంలో కాకర తింటే ఆ రోగాలు దరి చేరవు..!

by Anji
Ad

సాధారణంగా  చేదు తినడం శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహ బాధితులకు చాలా మంచిది. అందుకే కొందరు చేదు ఆకులను తింటారు. కొందరు చేదు రసాన్ని కూడా తీసుకుంటారు. చేదు కూరగాయలో కాకరకాయ ఒకటి. దీనిని షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తింటుంటారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలో ఐరన్, విటమిన్ సి, జింక్, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని రోజూ తీసుకుంటే వారికి ఔషధంలా పని చేస్తుంది.

Advertisement

కాకరలో మోమోర్టిసిన్ అనే ప్రత్యేక గ్లైకోసైడ్ అనే విష పదార్ధం ఉంటుంది. దీని కారణంగా దాని రుచి చేదుగా ఉంటుంది. అయితే ఇదే మూలకం మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ చేదు కాకరకాయను తినవచ్చు. ఈ చేదు కూరగాయ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాకరకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి  ప్రతీ రోజూ కాకరకాయ తినండి.

Advertisement

 

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, విటమిన్ ఎ, బి1 బి2, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం వంటి పోషకాలు చేదులో లభిస్తాయి. ఈ పోషకాలు కడుపులో పేరుకుపోయిన పురుగులు, అనవసరమైన చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. కాకరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కాకర కాయ ని తినండి ఆరోగ్యంగా ఉండండి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading