Telugu News » భార్యకు మల్లెపూలు తెస్తే జరిగేది అదే.. ప్రతీ భర్త తప్పక గుర్తుంచుకోవాలి..!

భార్యకు మల్లెపూలు తెస్తే జరిగేది అదే.. ప్రతీ భర్త తప్పక గుర్తుంచుకోవాలి..!

by Anji
Ad

సాధారణంగా హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో పలు ఆచార వ్యవహారాలు తాతల కాలం నుంచి వస్తున్నాయి. సనాతన ధర్మం ప్రకారం.. మనం ఆచరించే నియమాలు, విశ్వసించే నమ్మకాల వెనుక సైన్స్ దాగి ఉందనే విషయం తక్కువ మందికి తెలుసు.  చాలామంది ఆచారాలు పాటిస్తారు. కానీ కొందరూ  ఈ టెక్నాలజీ కాలంలో ఆచారాలు ఏంటి అని కొంతమంది కొట్టి పారేస్తారు. కానీ చదువుకున్న చాలా మంది కూడా ఇప్పటికీ ఆచారాలు విశ్వాసాలను పాటిస్తున్నారు.

Advertisement

ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్ల పిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో నిత్యం వింటుంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టి పారేసినా.. మరికొందరు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుందని అన్నది సత్యం. ఇక అలాంటిదే ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే.. భర్త తన భార్యకు రోజూ మల్లెపూలను తీసుకెళ్లడం.అవును.. మీరు చదివింది నిజమే.. ఇంతకీ ప్రతి రోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకుందాం. 

Advertisement

 ఇంటిని చూసి ఇల్లాలుని చూడమంటారు పెద్దలు.  ఇది నిజమేనండి.  ఇంట్లో ఆడవారు ఉంటే ఆ కళనే వేరు. ఇక ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత ఒదిగినా.. అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్థిక సమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజూ మూరెడు మల్లెపూలను తీసుకువెళ్తే చాలా మంచిదట. మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ప్రతిరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకుంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదేకాదు.. పరిమళ భరితమైన జాజి విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రాత్రి సమయంలో ఇలా పడుకుంటున్నారా.. అయితే మీరు తప్పక ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. చిటికెలో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..!

 

Visitors Are Also Reading