Home » పచ్చిపాలలో చిటికెడు పసుపు కలిపి చర్మానికి అప్లై చేస్తే.. చలికాలంలో ఆ సమస్యలు దూరం..!

పచ్చిపాలలో చిటికెడు పసుపు కలిపి చర్మానికి అప్లై చేస్తే.. చలికాలంలో ఆ సమస్యలు దూరం..!

by Anji
Ad

సాధారణంగా ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎలాంటి పోషకాల కొరత ఉండదని తరచూ వైద్యులు చెబుతుంటారు. పాలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇంట్లో మెరిసే చర్మాన్ని పొందాలంటే పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేస్తే సరి. చేతులతో కూడా మసాజ్ చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.

Advertisement

పాలల్లో విటమిన్ ఎ,డి, ఇ కూడా ఉంటాయి. ఇవి చర్మం లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. తర్వాత కూడా చర్మాన్ని కాపాడుకోవాలంటే పాలు తప్పనిసరిగా మీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. పచ్చిపాలను రోజూ ముఖానికి పట్టించడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. ఇది చర్మంపై సహజమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి, మృతకణాలను తొలగిస్తుంది. ఇది చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

Advertisement


చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అయితే పచ్చిపాలను తేనెతో కలిపి రాసుకుంటే ఈ సమస్య సులువుగా దూరమవుతుంది. పాలలో మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్స్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే సహజ కొవ్వు, ప్రోటీన్, నీరు చర్మాన్ని వృదుగా చేస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారడమే కాకుండా పలురకాల చర్మ సమస్యలు వస్తాయి. మొటిమల నుంచి దురద వరకు, దద్దుర్లు సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పచ్చిపాలలో పసుపు చిటికెడు కలిపి రాసుకోవాలి. ఈ యాంటీ ఇన్ఫ్లోమేటరీ పదార్థం చర్మంపై ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తుంది.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading