Home » ఆ హీరోతో నటిస్తే హీరోయిన్లు స్టార్లుగా మారడం పక్కా..!

ఆ హీరోతో నటిస్తే హీరోయిన్లు స్టార్లుగా మారడం పక్కా..!

by Anji
Ad

ఒకప్పుడు సినిమాల్లోని హీరోయిన్లు ఒక హీరోను తమ లక్కీ స్టార్ గా భావించే వారట. అతనితో నటించిన వెంటనే మంచి ఆఫర్‌లను పొంది, సినీ పరిశ్రమలో స్థిరపడేవారు. ఆయన మరెవరో కాదండోయ్.. బహుముఖ నటుడు, హాస్యనటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1945 మే 23న జన్మించిన చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా  సూపర్ హిట్ అయింది. 

Advertisement

మొదటి సినిమా సక్సెస్ తర్వాత హీరోగా, కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా విభిన్నమైన పాత్రలు చేస్తూ.. పలు సినిమాల్లో నటించాడు చంద్రమోహన్. అతను తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. విజయాలతో సంబంధం లేకుండా ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి పాత్రలకైనా సూట్ అయ్యేలా అతని ముఖకవళికలు బాగా ఆకట్టుకునేవి. చంద్ర మోహన్ తన కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లకు లక్కీ స్టార్‌గా నిలిచాడు.  

Advertisement

Also Read :  మోహన్ బాబు స్నేహితుడు రజినీకాంత్ కి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు.. కారణం అదేనా ?

Manam News

చంద్రమోహన్‌తో ఏ హీరోయిన్‌ నటించినా తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుతుందని,  త్వరలోనే ఇండస్ట్రీలో నంబర్‌వన్‌గా నిలుస్తుందనే నమ్మకం. ఉదాహరణకు హీరోయిన్ శ్రీదేవి  అనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ల్యాండ్ మార్క్‌గా నిలిచిన ‘పదహారేళ్ల వయసు’లో చంద్ర మోహన్‌తో కలిసి ఆమె నటించింది.  అప్పటి నుండి శ్రీదేవి తన కెరీర్‌ను అంతకంతకు పెంచుకుంది. వెనక్కి చూడకుండా ఎదిగిపోయింది. ‘సిరి సిరి మువ్వ’ చంద్రమోహన్ జయప్రదల మొదటి సినిమాగా విడుదలైంది. అలాగే విజయశాంతి కూడా మొదటి చిత్రం చంద్రమోహన్ తో కలిసి నటించడం విశేషం. చంద్ర మోహన్ 45 సంవత్సరాల నుండి సినిమా పరిశ్రమలో చాలా బిజీగా ఉన్నారు.

Also Read :  ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైత్రా రాయ్ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading