Home » ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైత్రా రాయ్ ఎవ‌రో తెలుసా..?

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైత్రా రాయ్ ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

Advertisement

జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాలో ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు నటిస్తున్నారు.

Advertisement

అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఈ సినిమాలో సీరియల్ నటి చైత్రా రాయ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ నటి ఈ మూవీతో వెండితెర పైకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చైత్ర రాయ్ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తాజాగా ధ్రువీకరించింది. అలాగే ఈ విషయంపై చైత్రా స్పందిస్తూ … జూనియర్ ఎన్టీఆర్ … సైఫ్ ఖాలీ ఖాన్ లాంటి నటీనటులు నటించిన మూవీలో నటించడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading