Home » శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..!

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..!

by Anji
Ad

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చాలా ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మనకు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. వాటిని పొరపాటున కూడా విస్మరించవద్దు. దానివల్ల మరిన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ లక్షణాలు కాళ్లలో కూడా కనిపిస్తాయి. సరైన సమయంలో పట్టించుకోకపోతే మీరు గుండెపోటు ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక రక్తపోటుకు గురవుతారు. అంతే కాదు, ఇంకా అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాళ్లపై కనిపించే లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


చలికాలంలో పాదాలు చల్లగా మారడం సర్వసాధారణం. అయితే మండే వేసవిలో కూడా మీ పాదాలు చల్లబడటం గమనిస్తే.. వెంటనే మేల్కోండి. ఎందుకంటే అది ఏదో అనర్ధానికి మూలం కావచ్చు. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం కావచ్చు. అటువంటి సందర్భాలలో వెంటనే చెక్ చేయించుకోవడం మంచిది. శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాల చర్మం రంగు మారిపోతుంది. ఇది పాదాలకు రక్త సరఫరాను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మీరు పాదాలపై స్పష్టంగా గమనిస్తారు. రక్తం లేకపోవడం వల్ల రక్తం ద్వారా చేరే ఆక్సిజన్, పోషకాల సరఫరాలో అంతరాయం కారణంగా చర్మం, గొళ్ళ రంగు మారడం ప్రారంభిస్తుంది.

Advertisement

Advertisement

రాత్రి నిద్రపోతున్న సమయంలో కాళ్ళ నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ సాధారణ లక్షణం. అంటే మీ శరీరం కింది భాగంలోని నరాలు దెబ్బతిన్నాయి. పాదంతో పాటు చూపుడు వేలు, మడమ లేదా బొటనవేలుతో తిమ్మిరి ఉంటే, అది మన నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. శరీర బరువు పెరుగుతున్న కొద్ది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతుంటాయి. దీంతో హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఎటాక్ చేస్తాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు వెంటనే దాన్ని కరిగించుకోవాలి. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Visitors Are Also Reading