Home » ఉప్పులో ఇంత శక్తి ఉందా ? దీంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

ఉప్పులో ఇంత శక్తి ఉందా ? దీంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

by Anji
Ad

సాధారణంగా అందరి ఇండ్లలో ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటుంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.   ఉప్పుతో  మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు.   అంతేకాదు.. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ప్రతి కూల ప్రభావాలు ఏర్పడుతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఇలా ఉపయోగించడం ఉత్తమం. ఉప్పును పర్యావరణ శుద్ధి అని కూడా పేర్కొంటారు. ఈ ఉప్పుతో ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

అలసట, నిరాశ, ప్రతికూల శక్తితో బాధపడుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయడం చాలా మంచిది. మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి తలస్నానం చేయడం వల్ల పునర్జీవనం శక్తివంతంగా ఉన్న అనుభూతిని పొందే అవకాశముంది. కోరుకున్న ఫలితాలను పొందకపోతే ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 5 నుంచి 7 సార్లు చుట్టి ఆ తరువాత ఆ ఉప్పు నీటిలో వేయడం చాాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. 

Advertisement

Also Read :   మిరియాలలో ఇన్ని పోషకాలుంటాయా..? వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Manam News

ఇంట్లో డబ్బు కొరతా ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాస్ నీటిలో ఉప్పు కలిపి ఉంచడం వల్ల డబ్బు పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరమై  ఎంతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరమయ్యే అవకాశముంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఉప్పు నీటితో శుభ్రం చేయడం ఎంతో మంచిది. నీటిలో కాస్త ఉప్పు వేసి వస్తువులను శుభ్రం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. మీ బాత్ రూం వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఉప్పును ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలను తగ్గించుకునే అవకాశముంది.  ఇంకెందుకు ఉప్పును మీరు కూడా ఇలా ఉపయోగించి దాని వల్ల కలిగే బెనిఫిట్స్ పొందండి. 

Also Read :   మిమ్మల్ని గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఈ చిట్కాతో వదిలించుకోండి..!

Visitors Are Also Reading